News August 31, 2024
వరంగల్: భారీ వర్షాల ఎఫెక్ట్.. టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు

భారీ వర్షాల నేపథ్యంలో వరంగల్ కలెక్టర్ ఆదేశాలమేరకు, వరంగల్ MRO కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటుచేసినట్టు MRO మహమ్మద్ ఇక్బాల్ తెలిపారు. అదేవిధంగా వరంగల్ మండలంలో ముంపు ప్రాంతాలైన ఏనుమాముల, శ్రీనగర్ బాలాజీ నగర్, చాకలి ఐలమ్మ నగర్, హంటర్ రోడ్ ప్రాంతం, సాయినగర్, NTRనగర్ లోతట్టు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసర పరిస్థితిలో 18004253424, 701362828, 9948225160 వివరాలు తెలపాలన్నారు.
Similar News
News December 1, 2025
గ్రామపంచాయతీ ఎన్నికలపై కలెక్టర్ సత్య శారద సమీక్ష

వరంగల్ జిల్లాలో గ్రామపంచాయతీ, వార్డ్ మెంబర్ రెండో సాధారణ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద నియమించిన నోడల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తిస్థాయిలో పారదర్శకంగా, నిష్పక్షపాతంగా సాగేందుకు నోడల్ అధికారులు మరింత శ్రద్ధ వహించాలని ఆదేశాలు జారీ చేశారు.
News December 1, 2025
ఎయిడ్స్పై అవగాహన అత్యంత అవసరం: కలెక్టర్

వరల్డ్ ఎయిడ్స్ డే-2025 సందర్భంగా వరంగల్ జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్లో నిర్వహించిన అవగాహన సమావేశంలో కలెక్టర్ డాక్టర్ సత్య శారద ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎయిడ్స్పై సమాజంలో విస్తృత అవగాహన అవసరమని, ముందస్తు జాగ్రత్తలు, సరైన సమాచారంతోనే వ్యాధిని నిరోధించగలమని పేర్కొన్నారు.
News December 1, 2025
వరంగల్: హెచ్ఐవీ కేసులు ఆందోళనకరం!

జిల్లాలో ఇప్పటి వరకు 5,464 మంది హెచ్ఐవీ బాధితులు నమోదు కాగా, వీరిలో 4,558 మందికి ప్రభుత్వం ప్రతి నెల ఉచిత మందులు అందిస్తోంది. 863 మంది బాధితులకు ఏఆర్జే ద్వారా నెలకు రూ.2,016 పెన్షన్ ఇస్తున్నారు. నెలకు సగటున 36 కొత్త హెచ్ఐవీ కేసులు వెలుగులోకి వస్తుండటం, గర్భిణులు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో హై రిస్క్ వ్యక్తులు 3,498 మంది ఉన్నారు.
#నేడు ప్రపంచ ఎయిడ్స్ డే.


