News August 29, 2024
వరంగల్: మక్కలు క్వింటా రూ.2,936

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మళ్లీ రికార్డు నమోదైంది. మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఈరోజు మక్కలకు రికార్డు ధర వచ్చింది. నేడు క్వింటా మక్కలకు రూ.2,936 ధర వచ్చినట్లు మార్కెట్ కార్యదర్శి నిర్మల తెలిపారు. కాగా మంగళవారం రూ.2,885 పలికిన క్వింటా మక్కలకు బుధవారం రూ.2,911 ధర వచ్చింది.
Similar News
News December 4, 2025
వరంగల్: ఇక ‘గుర్తుల’ ప్రచారం..!

స్థానిక సంస్థల ఎన్నికల్లో మొదటి విడత నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసి అభ్యర్థులకు ఎన్నికల అధికారులు గుర్తులు కేటాయించారు. నామినేషన్ దాఖలు చేసినప్పటి నుంచి ఇప్పటివరకు అభ్యర్థులు గుర్తులు లేకుండానే గ్రామాల్లో తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ప్రస్తుతం గుర్తులు కేటాయించడంతో ఇక వాటితో ప్రచారం ప్రారంభించారు. సోషల్ మీడియాలో వారికి కేటాయించిన గుర్తులతో హోరెత్తిస్తున్నారు.

News December 3, 2025
నామినేషన్ల ప్రక్రియ పారదర్శకంగా జరిగిన చూడాలి: కలెక్టర్

గ్రామపంచాయతీ ఎన్నికల మూడో విడత నామినేషన్ల ప్రక్రియ పారదర్శకంగా జరగాలని వరంగల్ కలెక్టర్ సత్య శారద అన్నారు. అమిన్పేట క్లస్టర్ గ్రామపంచాయతీ కార్యాలయాన్ని సందర్శించారు. నామినేషన్ స్వీకరణ కేంద్రంలో జరుగుతున్న ఏర్పాట్లు, సిబ్బంది పనితీరు, అభ్యర్థుల రద్దీ, సమర్పణ ప్రక్రియను ఆమె సమగ్రంగా పరిశీలించారు. అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు.