News February 27, 2025

వరంగల్: మధ్యాహ్నం 2గంటల వరకు 75.64% పోలింగ్

image

వరంగల్ జిల్లాలో మధ్యాహ్నం 2 గంటల వరకు 75.64 శాతం పోలింగ్ నమోదైనట్లు ఉపాధ్యాయ ఎన్నికల అధికారి తెలిపారు. వరంగల్ జిల్లాలో మొత్తం 2,352 ఓట్లకు మధ్యాహ్నం 2గంటల వరకు 1,779 ఓట్లు పోలైనట్లు చెప్పారు. 13మండలాల్లో 13 చొప్పున పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

Similar News

News February 28, 2025

వరంగల్: ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

image

ఉరేసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఎనుమాముల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు జరిగింది. సీఐ రాఘవేందర్ కథనం ప్రకారం.. బాలాజీనగర్‌కి చెందిన జక్కోజు శివకృష్ణచారి(31)కూలీ పని చేస్తుండేవాడు. తరచు మద్యం తాగి ఇంట్లో భార్యతో గొడవ పడేవాడు. నిన్న సాయంత్రం మద్యం తాగి వచ్చిన అనంతరం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడన్నారు. భార్య లావణ్య ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసినట్లు తెలిపారు.

News February 28, 2025

జిల్లాలో రాయపర్తిలోనే తక్కువ పోలింగ్

image

రాయపర్తి మండలంలో గురువారం జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్లో వరంగల్ జిల్లాలోనే తక్కువ పోలింగ్ శాతం నమోదైంది. రాయపర్తి మండలంలో 66మంది ఓటర్లుండగా.. 60 మంది టీచర్లు ఓటును వినియోగించుకున్నారు. మొత్తంగా 90.90శాతం పోలింగ్ నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా జిల్లాలో ఎక్కువగా సంగెం మండలంలో 98.48శాతం నమోదైంది.

News February 28, 2025

వరంగల్: మీ మండలంలో ఎంత పోలింగ్ అయిందంటే..?

image

వరంగల్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. జిల్లాలో 94.13శాతం పోలింగ్ నమోదైంది. మండలాల వారీగా పోలింగ్ శాతాలు ఇలా ఉన్నాయి. వర్ధన్నపేట-97.83, రాయపర్తి-90.91, నెక్కొండ-97.18, ఖానాపురం-94.52, నర్సంపేట- 94.91, చెన్నారావుపేట-94.92, పర్వతగిరి-97.44, సంగెం-98.48, నల్లబెల్లి-95.24, దుగ్గొండి-91.67, గీసుకొండ-94.44, వరంగల్-93.07, ఖిల్లా వరంగల్-93.99

error: Content is protected !!