News March 27, 2025

వరంగల్: మరమ్మత్తుల కారణంగా చర్లపల్లి వరకే కృష్ణ ఎక్స్‌ప్రెస్ రైలు

image

కృష్ణ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ స్టేషన్ వరకు వెళ్లడం లేదని రైల్వే జీయం అరుణ్ కుమార్ జైన్ ప్రకటనలో తెలిపారు. చర్లపల్లి స్టేషన్‌ను అభివృద్ధి చేయడంతో పాటు, కొన్ని మరమ్మత్తుల కారణంగా కృష్ణ ఎక్స్‌ప్రెస్‌ను చర్లపల్లి వరకే పరిమితం చేశామని, సికింద్రాబాద్‌కు పోవు ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని సూచించారు. ప్రయాణికులు గమనించి, సహకరించాల్సిందిగా వారు కోరారు.

Similar News

News November 20, 2025

మెదక్: స్థానిక పోరు.. ఆశావాహుల్లో కొత్త ఊపు!

image

పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్రం ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో సందడి మొదలైంది. బీసీ రిజర్వేషన్లు అనుకూలంగా రాకపోవడంతో నిరాశ చెందిన ఆశావాహుల్లో ఆశలు చిగురించాయి. సంగారెడ్డి జిల్లాలో 647 GPలు, 5,778 వార్డులు, మెదక్‌‌ జిల్లాలో 469 GPలు, 4,082 వార్డులు, సిద్దిపేట జిల్లాలో 499 జీపీలు, 4,476 వార్డులు ఉన్నాయి.

News November 20, 2025

ఇజ్రాయెల్ దాడిలో 27 మంది మృతి

image

ఇజ్రాయెల్-హమాస్ మధ్య పదే పదే సీజ్ ఫైర్ ఉల్లంఘన జరుగుతోంది. నిన్న ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 27 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. గాజాలో 14 మంది, ఖాన్ యూనిస్ ఏరియాలో 13 మంది మరణించినట్లు వెల్లడించారు. హమాస్ సీజ్ ఫైర్ ఉల్లంఘనకు పాల్పడటంతోనే దాడులు చేస్తున్నట్లు ఇజ్రాయెల్ చెబుతోంది. పరిస్థితులు మెరుగవుతున్న సమయంలో మరోసారి దాడులు ఆందోళనకు గురి చేస్తున్నాయని గాజా స్థానికులు చెబుతున్నారు.

News November 20, 2025

KTRకు బిగ్ షాక్.. విచారణకు గవర్నర్ అనుమతి

image

TG: మాజీ మంత్రి కేటీఆర్‌కు బిగ్ షాక్ తగిలింది. ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో ఛార్జ్‌షీట్ వేసేందుకు గవర్నర్ అనుమతి ఇచ్చారు. నిధుల దుర్వినియోగంపై విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఏసీబీ త్వరలో KTRపై అభియోగాలు నమోదు చేయనుంది. కాగా కొన్నిరోజుల క్రితం విచారణకు అనుమతి కోరుతూ ప్రభుత్వం గవర్నర్‌కు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ కేసులో A-1గా కేటీఆర్, A-2గా అరవింద్ కుమార్ ఉన్నారు.