News March 27, 2025
వరంగల్: మరమ్మత్తుల కారణంగా చర్లపల్లి వరకే కృష్ణ ఎక్స్‌ప్రెస్ రైలు

కృష్ణ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ స్టేషన్ వరకు వెళ్లడం లేదని రైల్వే జీయం అరుణ్ కుమార్ జైన్ ప్రకటనలో తెలిపారు. చర్లపల్లి స్టేషన్‌ను అభివృద్ధి చేయడంతో పాటు, కొన్ని మరమ్మత్తుల కారణంగా కృష్ణ ఎక్స్‌ప్రెస్‌ను చర్లపల్లి వరకే పరిమితం చేశామని, సికింద్రాబాద్‌కు పోవు ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని సూచించారు. ప్రయాణికులు గమనించి, సహకరించాల్సిందిగా వారు కోరారు.
Similar News
News February 24, 2026
వనపర్తి: ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం

వనపర్తి జిల్లాలో ఇంటర్ పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు DIEO ఎర్ర అంజయ్య తెలిపారు. జిల్లావ్యాప్తంగా 25 కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, మాస్ కాపీయింగ్‌కు తావులేకుండా నిఘా ఉంచామని పేర్కొన్నారు. ఈ పరీక్షల కోసం 633 మంది ఇన్విజిలేటర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించినట్లు మంగళవారం వెల్లడించారు.
News February 24, 2026
ఒకరోజు ముందే పెన్షన్లు

AP: రాష్ట్ర ప్రభుత్వం ఒకరోజు ముందే పెన్షన్లను పంపిణీ చేయనుంది. మార్చి 1న ఆదివారం ప్రభుత్వ ఆఫీసులకు సెలవు ఉండటంతో ఈనెల 28న అందజేయాలని గ్రామ, వార్డు సచివాలయాలకు ఆదేశాలు జారీ చేసింది. పింఛన్ల పంపిణీ నేపథ్యంలో ఆ రోజున అసెంబ్లీకి సెలవు ఇవ్వాలని CM చంద్రబాబు నిర్ణయించారు. పంపిణీలో మంత్రులు, ఎమ్మెల్యేలు తప్పనిసరిగా పాల్గొనాలని స్పష్టంచేశారు. మరోవైపు 28న పెన్షన్లు అందుకోని వారికి మార్చి 2న ఇవ్వనున్నారు.
News February 24, 2026
పరిశ్రమల్లో భద్రత ముఖ్యం: కలెక్టర్ హనుమంతరావు

జిల్లాలోని పరిశ్రమల్లో అగ్నిప్రమాదాలు, పేలుళ్లు జరగకుండా యాజమాన్యాలు కఠిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. ఎస్పీ అక్షాంష్ యాదవ్‌తో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. రసాయన, డ్రగ్ ఫ్యాక్టరీల్లో అధికారులు నిరంతరం తనిఖీలు చేయాలన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు ప్రజలకు ఇబ్బంది కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ఎస్పీ సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.


