News March 27, 2025

వరంగల్: మరమ్మత్తుల కారణంగా చర్లపల్లి వరకే కృష్ణ ఎక్స్‌ప్రెస్ రైలు

image

కృష్ణ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ స్టేషన్ వరకు వెళ్లడం లేదని రైల్వే జీయం అరుణ్ కుమార్ జైన్ ప్రకటనలో తెలిపారు. చర్లపల్లి స్టేషన్‌ను అభివృద్ధి చేయడంతో పాటు, కొన్ని మరమ్మత్తుల కారణంగా కృష్ణ ఎక్స్‌ప్రెస్‌ను చర్లపల్లి వరకే పరిమితం చేశామని, సికింద్రాబాద్‌కు పోవు ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని సూచించారు. ప్రయాణికులు గమనించి, సహకరించాల్సిందిగా వారు కోరారు.

Similar News

News November 8, 2025

రేపటి నుంచి మద్యం షాపులు బంద్: CP

image

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గం పరిధిలో 144 సెక్షన్ అమలు చేయనున్నట్లు HYD సీపీ సజ్జనార్ వెల్లడించారు. రేపు సా.6 నుంచి ఈ నెల 11న (పోలింగ్ తేదీ) సా.6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. ఈ నెల 14న కౌంటింగ్ సందర్భంగా ఉ.6 నుంచి 15న ఉ.6 గంటల వరకూ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. నిర్దేశించిన సమయాల్లో హోటళ్లు, రెస్టారెంట్‌లు, క్లబ్బులు కూడా మూసివేయాలన్నారు.

News November 8, 2025

₹60,799Crతో రోడ్ల నిర్మాణం.. రికార్డు: మంత్రి

image

TG: రాష్ట్రంలో ₹60,799Crతో రోడ్లు నిర్మించనున్నట్లు మంత్రి వెంకట్‌రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర చరిత్రలో ఇది రికార్డని, RRR నిర్మాణానికి ₹36,000Cr, HYD-VJA హైవే విస్తరణకు ₹10,400కోట్లు, HAM ప్రాజెక్టుకు ₹11,399Cr కేటాయించామన్నారు. ₹8,000Crతో మన్ననూర్-శ్రీశైలం ఎలివేటర్ కారిడార్‌, ₹20,000Crతో ఫ్యూచర్ సిటీ-బందరు పోర్ట్ గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రతిపాదనలు ఉన్నాయన్నారు. గ్రామాల్లో డబుల్ రోడ్లు వేస్తామన్నారు.

News November 8, 2025

KTDM: ఆస్పత్రుల సేవలు భేష్.. ప్రభుత్వానికి నివేదిక

image

కొత్తగూడెం జిల్లాలోని టీవీవీపీ ఆసుపత్రుల సేవలు అద్భుతంగా ఉన్నాయని సీఆర్‌ఎం బృంద సభ్యులు డాక్టర్ జి.బి. సింగ్ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. వారు పరిశీలించిన ఇల్లందు, భద్రాచలం ఆసుపత్రులలోని వైద్య ప్రమాణాలు అత్యున్నతంగా ఉన్నాయన్నారు. మారుమూల ఏజెన్సీ ప్రాంతమైనప్పటికీ, స్పెషలిస్ట్ వైద్య సేవలు అద్భుతంగా అందుతున్నాయని, నాణ్యమైన వైద్యం అందిస్తూ ఆసుపత్రులు భేష్ అని కొనియాడారు.