News October 2, 2024

వరంగల్: మరికాసేపట్లో DSC సర్టిఫికెట్ వెరిఫికేషన్

image

వరంగల్ జిల్లాలో DSCలో SGT అభ్యర్థులు 1 :3నిష్పత్తిలో 435 మంది, SGT ఉర్దూలో 25 మంది సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు అర్హత సాధించారని డీఈఓ జ్ఞానేశ్వర్ తెలిపారు. బుధవారం ఉ.10 గంటల నుంచి సా. 5 గంటల వరకు GTలో 270 మంది, SGT ఉర్దూలో 25 మంది అభ్యర్థులు వెరిఫికేషన్‌కు రావాలన్నారు. ఒరిజినల్ సర్టిఫికెట్లతో, రెండు సెట్లు గెజిటెడ్ తప్పనిసరన్నారు. వివరాలకు www.deowarangal.net సంప్రదించాలన్నారు.

Similar News

News October 9, 2024

నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీతక్క

image

హైదరాబాదులో డీఎస్సీ అభ్యర్థులకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి మంత్రి సీతక్క పాల్గొన్నారు. ముందుగా సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మంత్రి సీతక్క జ్యోతి ప్రజ్వలన చేశారు. కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

News October 9, 2024

వరంగల్: రేపటి నుంచి ఎనుమాముల మార్కెట్‌కు సెలవులు

image

వరంగల్ నగరంలోని ఎనుమాముల మార్కెట్‌కు రేపటి నుంచి నాలుగు రోజులు వరుసగా సెలవులు ప్రకటిస్తున్నామని మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి పి. నిర్మల ఒక ప్రకటనలో తెలిపారు. రేపు దుర్గాష్టమి, ఎల్లుండి మహార్నవమి, 12న విజయదశమి, 13న ఆదివారం సందర్భంగా మార్కెట్ బంద్ ఉంటుందన్నారు. కాబట్టి రైతులు మార్కెట్‌కు రాకూడదని పేర్కొన్నారు. ఈనెల 14న మార్కెట్ పునః ప్రారంభమవుతుందని తెలిపారు.

News October 9, 2024

BHPL: 12వ తేదీన రావణసుర వధ కార్యక్రమం

image

గోరి కొత్తపల్లి మండల కేంద్రంలో స్నేహ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 12వ తేదీన రాత్రి 8 గంటలకు రావణాసుర వాద కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు యూత్ అధ్యక్షుడు ఆవుల రాజు తెలిపారు. మండలంలో తొలిసారిగా రావణ వధ కార్యక్రమాన్ని చేపడుతున్నామని, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని రాజు పిలుపునిచ్చారు.