News February 21, 2025

వరంగల్: మళ్లీ పెరిగిన మొక్కజొన్న ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి శుక్రవారం మొక్కజొన్న తరలివచ్చింది. అయితే ధర ఈ వారం మొదటి రోజుతో పోలిస్తే భారీగా పెరిగింది. మంగళవారం మక్కలు(బిల్టీ)కి రూ.2,311 ధర రాగా నేడు రూ.2,370కి చేరినట్లు వ్యాపారులు తెలిపారు. అలాగే సూక పల్లికాయకి రూ.6,600, పచ్చి పల్లికాయకి రూ.5,500 ధర వచ్చింది. మార్కెట్లో క్రయవిక్రయాలు కొనసాగుతున్నాయి.

Similar News

News December 7, 2025

అంతనపురం మహిళా నేతకు కీలక పదవి

image

బీజేపీ మహిళా మోర్చా అనంతపురం జిల్లా అధ్యక్షురాలిగా అనంతపురానికి చెందిన సౌభాగ్య నియామకమయ్యారు. ఈ మేరకు అనంతపురంలోని పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కొనకొండ్ల రాజేశ్ ఆమెకు నియామక పత్రం శనివారం అందజేశారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని సౌభాగ్య చెప్పారు. పదవిని బాధ్యతగా భావిస్తానన్నారు.

News December 7, 2025

న్యాయం చేయండి.. మోదీకి పాక్ మహిళ అభ్యర్థన

image

తనకు న్యాయం చేయాలని ప్రధాని మోదీని పాకిస్థాన్ మహిళ కోరారు. తన భర్త విక్రమ్ నాగ్‌దేవ్ కరాచీ నుంచి లాంగ్ టర్మ్ వీసాపై ఇండోర్‌(MP) వచ్చి అక్కడే ఉంటున్నాడని పేర్కొన్నారు. అతను ఢిల్లీకి చెందిన మరో యువతితో పెళ్లికి సిద్ధమైనట్టు తెలిసిందని చెప్పారు. జనవరిలో కేసు ఫైల్ చేసినా లీగల్‌గా న్యాయం జరగలేదన్నారు. ప్రధాని మోదీ న్యాయం చేయాలంటూ అభ్యర్థించిన వీడియో వైరలవుతోంది. దీనిపై లీగల్ బాడీస్ మండిపడుతున్నాయి.

News December 7, 2025

NZB:16 కిలోమీటర్ల LT కండక్టర్ వైరు చోరీ

image

నిజామాబాద్ శివారులోని గూపన్‌పల్లి ప్రాంతంలో TSNPDCLకు సంబంధించిన LT కండక్టర్ వైర్‌ను దుండగులు దొంగిలించినట్లు రూరల్ SHO శ్రీనివాస్ తెలిపారు. అశోక వెంచర్ LOB ఎలక్ట్రిసిటీ అధికారులు పరిశీలించగా SS 55/25 నుంచి SS 56/25 వరకు KVDRల నుంచి సుమారు 16 కిలోమీటర్ల LT కండక్టర్ వైర్‌ను కత్తిరించినట్లు గుర్తించారు. దీంతో ఎలక్ట్రిసిటీ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు SHO పేర్కొన్నారు.