News February 16, 2025
వరంగల్: మహాశివరాత్రికి ప్రత్యేక బస్సులు

మహా శివరాత్రి పురస్కరించుకొని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి పుణ్య క్షేత్రానికి వరంగల్ రీజియన్ నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. వరంగల్-1 డిపో నుంచి 21 బస్సులు, హనుమకొండ 27, మహబూబాబాద్ 30, నర్సంపేట 30, పరకాల 24 బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Similar News
News March 19, 2025
కొల్లిపర: పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

కొల్లిపరలోని జడ్పీ పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ నాగలక్ష్మి బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు పరీక్ష రాస్తున్న తరగతి గదులను పరిశీలించారు. పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారో అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కొల్లిపర పాఠశాలను సెన్సిటివ్ జాబితాలో ఎందుకు చేర్చారని అధికారులను ప్రశ్నించారు.
News March 19, 2025
టీచర్ల బదిలీల చట్టంతో చరిత్ర సృష్టించబోతున్నాం: లోకేశ్

AP: ఏపీ ఉపాధ్యాయ బదిలీల క్రమబద్ధీకరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయ బదిలీల చట్టం ఒక చరిత్రాత్మక నిర్ణయం అన్నారు. ‘YCP ప్రభుత్వంలో అడ్డగోలుగా బదిలీలు జరిగాయి. అందరితో చర్చించాకే టీచర్ల బదిలీల చట్టం తీసుకొచ్చాం. పారదర్శకంగా ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా ఉంటుంది. టీచర్ల బదిలీల చట్టం ద్వారా మా ప్రభుత్వం చరిత్ర సృష్టించబోతోంది’ అని లోకేశ్ అన్నారు.
News March 19, 2025
బడ్జెట్‌లో పేజీలే పెరిగాయి.. సంక్షేమం కాదు: హరీశ్ రావు

TG: మహిళలను ప్రభుత్వం మోసం చేస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ‘బడ్జెట్‌లో అబద్ధాలు, అతిశయోక్తులే ఉన్నాయి. మహిళలకు రూ.5లక్షలు మాత్రమే వడ్డీలేని రుణం ఇస్తున్నారు. బడ్జెట్‌లో మాత్రం రూ.లక్ష కోట్ల వడ్డీలేని రుణాలు ఇస్తున్నామన్నారు. బడ్జెట్ పేజీలు పెరిగాయి తప్ప పేదలకు సంక్షేమం పెరగలేదు. మహిళలకు రూ.2,500 హామీ ఊసే లేదు. కానీ అందాల పోటీలకు రూ.250 కోట్లు బడ్జెట్‌లో పెట్టారు’ అని విమర్శించారు.