News April 4, 2025

వరంగల్: మాయదారి వానలు.. అప్పులే గతి!

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రస్తుతం పంటలన్నీ చివరి దశకు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో వర్షం పడితే అప్పులే దిక్కు అని ఓరుగల్లు రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. పర్వతగిరి, నెక్కొండ, రాయపర్తిలో మొక్కజొన్న, వరి చివరిదశకు చేరుకోగా.. తొర్రూరు, కొత్తగూడతో పాటు పలుప్రాంతాల్లో పంటకోసి కుప్పనూర్చారు. ఇప్పుడు ఈదురు గాలులతో వర్షం పడితే పంట నేలకు ఒరిగే అవకాశముంది. వర్షం ఎప్పుడు పడుతుందోనని ఆందోళన పడుతున్నారు.

Similar News

News October 31, 2025

సూర్యాపేట: ఉరేసుకొని విద్యార్థి ఆత్మహత్య

image

సంగారెడ్డి జేఎన్టీయూ హాస్టల్‌లో మోతె మండలం, సిరికొండ తాండాకు చెందిన విద్యార్థి మహేందర్ ఆత్మహత్య చేసుకున్నాడు. 3 రోజులుగా కాలేజీకి వెళ్లకుండా హాస్టల్ గదిలో ఉన్న మహేష్ శుక్రవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తోటి విద్యార్థులు తెలిపారు. మహేష్ గదిలో సూసైడ్ నోటు లభ్యమైనట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News October 31, 2025

MNCL: ఉద్యోగ విరమణ పొందిన పోలీస్‌‌లకు సత్కారం

image

రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌లో సుదీర్ఘకాలం విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందిన పోలీస్‌ అధికారులను సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా శుక్రవారం సత్కరించారు. కమిషనరేట్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పదవీ విరమణ పొందిన పోలీస్‌‌లు ఏఎస్ఐ రామస్వామి, హెడ్ కానిస్టేబుల్ తిరుపతిని పూలమాలలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవితం గడపాలని సూచించారు.

News October 31, 2025

ఇంట్లో గోడ కూలి మహిళ మృతి.. మరొకరికి గాయాలు

image

ఇంట్లోని గోడ కూలి మహిళ మృతి చెందగా, మరో మహిళకు గాయాలైన ఘటన శుక్రవారం చింతకొమ్మదిన్నె మండలం కొప్పర్తి గ్రామం హరింద్రానగర్‌లో చోటుచేసుకుంది. కొట్లూరు శివమ్మ (52)ను గాయాలతో కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. మరో మహిళ అత్త కొట్లూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ ఘటనపై చింతకొమ్మదిన్నె పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.