News March 28, 2025
వరంగల్ మార్కెట్‌కి వరుసగా నాలుగు రోజులు సెలవులు

వరంగల్ నగరంలోని ఎనమాముల వ్యవసాయ మార్కెట్‌కు ప్రభుత్వం వరుసగా నాలుగు రోజులు సెలవు ప్రకటించింది. ఈ మేరకు మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి తెలిపారు. ఈ సమయంలో మార్కెట్ యార్డులో ఎలాంటి క్రయవిక్రయాలు జరగవని చెప్పారు. ఈనెల 29 అమావాస్య బంధు, 30 ఆదివారం, ఉగాది, సోమవారం రంజాన్,31 మంగళవారం రంజాన్ మరుసటి రోజు ప్రభుత్వ సెలవుగా ప్రకటించబడింది. తిరిగి మార్కెట్ ఏప్రిల్ 2వ తారీకు ప్రారంభమవుతుందన్నారు.
Similar News
News December 5, 2025
ఇసుక త్రవ్వకాలు రవాణా పారదర్శకంగా నిర్వహించాలి: కలెక్టర్

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఉచిత ఇసుక పాలసీ విధానం ద్వారా ఇసుక త్రవ్వకాలు, రవాణా పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించి ప్రజలకు ఇసుక కొరత లేకుండా చూడాలని అధికారులకు కలెక్టర్ మహేశ్ కుమార్ సూచించారు. అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ప్రస్తుత ఇసుక నిలువలు, ఇప్పటివరకు నిర్వహించిన ఇసుక లావాదేవీలు, ఆన్లైన్ బుకింగ్ వ్యవస్థలపై ఆయన అధికారులతో చర్చించారు.
News December 5, 2025
అనుకున్నదానికంటే విద్యా విధానం మెరుగ్గా ఉంది: సీఎం

అనుకున్నదానికంటే విద్యా విధానం మెరుగ్గా ఉందని సీఎం చంద్రబాబునాయుడు వెల్లడించారు. భామినిలో జరిగిన మెగా పేరెంట్స్ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు కూడా విద్యను అత్యున్నత స్థాయిలో అందిపుచ్చుకుంటున్నారని అన్నారు. ఒకప్పుడు పిల్లలు భారం కానీ ఇప్పుడు పిల్లలే ఆస్తి, పిల్లలే శ్రీరామ రక్ష, పిల్లలే భవిష్యత్ అని కొనియాడారు. విద్యార్థుల భవిష్యత్తుకు రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందింస్తుదన్నారు.
News December 5, 2025
డేంజర్‌లో శ్రీశైలం డ్యాం!

కృష్ణా నదిపై ఉన్న శ్రీశైలం డ్యామ్ భద్రత ప్రమాదంలో ఉందని నిపుణుల కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. డ్యామ్ దిగువన ప్లంజ్ పూల్ వద్ద ఏర్పడిన భారీ రంధ్రం డ్యామ్ పునాదుల కంటే ఎక్కువ లోతుకు విస్తరించిందని అండర్ వాటర్ పరిశీలనలో తేలింది. ఈ రంధ్రం 35–45 మీటర్ల లోతు, 150 మీటర్ల వెడల్పు ఉందని పేర్కొంది. ప్రభుత్వం వెంటనే స్పందించి మరమ్మతు పనులు చేపట్టాలని కమిటీ సూచించింది.


