News March 28, 2025
వరంగల్ మార్కెట్‌కి వరుసగా నాలుగు రోజులు సెలవులు

వరంగల్ నగరంలోని ఎనమాముల వ్యవసాయ మార్కెట్‌కు ప్రభుత్వం వరుసగా నాలుగు రోజులు సెలవు ప్రకటించింది. ఈ మేరకు మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి తెలిపారు. ఈ సమయంలో మార్కెట్ యార్డులో ఎలాంటి క్రయవిక్రయాలు జరగవని చెప్పారు. ఈనెల 29 అమావాస్య బంధు, 30 ఆదివారం, ఉగాది, సోమవారం రంజాన్,31 మంగళవారం రంజాన్ మరుసటి రోజు ప్రభుత్వ సెలవుగా ప్రకటించబడింది. తిరిగి మార్కెట్ ఏప్రిల్ 2వ తారీకు ప్రారంభమవుతుందన్నారు.
Similar News
News April 25, 2025
KMR: ప్రియుడితో కలిసి భర్తను చంపింది

రామారెడ్డి PSలో ఏడాది క్రితం మిస్సైన కేసును పోలీసులు చేధించారు. ASP చైతన్యరెడ్డి వివరాలిలా.. ఇస్సన్నపల్లి వాసి తిరుపతి భార్య మనెవ్వకు లింబయ్యతో అక్రమ సంబంధం ఏర్పడిందని తేలింది. తిరుపతి అడ్డుగా ఉన్నాడని లింబయ్య మరో ఇద్దరితో కలిసి తిరుపతిని మందు తాగుదాం అని చెప్పి డొంకల్ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అనంతరం హత్య చేసి పెట్రోల్ పోసి మృతదేహాన్ని తగలబెట్టారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేశారు.
News April 25, 2025
VKB: బాల్య వివాహాల నిర్మూలనకు చర్యలు: అదనపు కలెక్టర్

బాల్య వివాహాల నిర్మూలనకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్ తెలిపారు. గురువారం వికారాబాద్ కలెక్టరేట్లో బాల్య వివాహల నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత శాఖలతో అదనపు కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. బాల్య వివాహలను నిర్మూలించేలా ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగాలని అదనపు కలెక్టర్ సూచించారు.
News April 25, 2025
గంభీరావుపేట: అనుమానస్పదంగా ఇద్దరు మృతి

అనుమానాస్పద రీతిలో ఇద్దరు మృతి చెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గజ సింగవరంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఉల్లి శ్రీకాంత్ తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వారి ఇంటికి కొద్ది దూరంలో ఉన్న చెరుకూరి రేఖ అదే ఇంట్లో మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు.