News February 20, 2025
వరంగల్ మార్కెట్‌కి 5 రోజుల సెలవులు

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి వరుసగా 5 రోజుల సెలవులు రానున్నాయి. ఈనెల 26 మహాశివరాత్రి, 27న జాగరణ, 28న అమావాస్య, మార్చ్ 1, 2న శనివారం, ఆదివారం సాధారణ సెలవు నేపథ్యంలో మార్కెట్‌ను మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాబట్టి, రైతులు గమనించి 5 రోజులు సరుకులు తీసుకొని రావద్దని సూచించారు. తిరిగి మార్చి 3న సోమవారం మార్కెట్ ప్రారంభం అవుతుందన్నారు.
Similar News
News November 23, 2025
జీపీవోల సంఘం ఉమ్మడి జిల్లా కన్వీనర్‌గా శ్రీనివాస్

గ్రామ పాలనాధికారుల(జీపీవో) సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్‌గా జనగామకు చెందిన పెండెల శ్రీనివాస్ నియమితులయ్యారు. తనపై నమ్మకంతో ఉమ్మడి జిల్లా బాధ్యతలు అప్పగించిన ఆ సంఘం రాష్ట్ర నాయకత్వానికి కృతఙ్ఞతలు తెలిపారు. జీపీవోల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఆయనకు పలువురు అభినందనలు తెలిపారు.
News November 23, 2025
సాయి సేవా స్ఫూర్తితోనే అభివృద్ధి: సీఎం చంద్రబాబు

మన ముందు నడయాడిన దైవం శ్రీ సత్యసాయిబాబా శత జయంతి సందర్భంగా ఆయన చూపిన సేవా మార్గాన్ని స్మరించుకుందామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. విద్య, వైద్యం, తాగునీరు వంటి సేవలతో ‘మానవ సేవే మాధవ సేవ’ అని బాబా నిరూపించారని తెలిపారు. సత్యసాయి సిద్ధాంతం ద్వారా ప్రపంచానికి జ్ఞానం, సన్మార్గం లభించాయని, ఆయన స్ఫూర్తితోనే రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తామని సీఎం దివ్యాంజలి ఘటించారు.
News November 23, 2025
కొత్తగూడెం: దుప్పి మాంసం కేసు.. రిమాండ్

అశ్వాపురం మండలం మిట్టగూడెంలో దుప్పిని వేటాడి మాంసం విక్రయించిన కేసులో ఇద్దరు నిందితులకు కొత్తగూడెం జిల్లా కోర్టు మేజిస్ట్రేట్ శనివారం 14 రోజుల రిమాండ్ విధించారు. మిట్టగూడేనికి చెందిన సప్కా వీరస్వామి, కనితి కన్నయ్యలను శుక్రవారం రాత్రి దుప్పి మాంసంతో సహా అటవీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని జిల్లా కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి రిమాండ్ ఉత్తర్వులు జారీ చేశారు.


