News April 11, 2025
వరంగల్ మార్కెట్‌కు మూడు రోజుల సెలవులు

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి వరుసగా 3 రోజుల సెలవులు రానున్నాయి. శనివారం వారంతపు యార్డు బంద్, ఆదివారం సాధారణ సెలవు, సోమవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా మార్కెట్‌ను మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాబట్టి, రైతులు గమనించి మూడు రోజులు సరుకులు తీసుకొని రావద్దని విజ్ఞప్తి చేశారు. తిరిగి మంగళవారం మార్కెట్ ప్రారంభం అవుతుందన్నారు.
Similar News
News November 10, 2025
వరంగల్ ప్రజలు ఈ వారం జాగ్రత్త

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఈనెల 11 నుంచి వారం రోజులపాటు చలి పంజా విసరనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నెల 11 నుండి 19 వరకు వరంగల్, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, జనగామ జిల్లాల్లో 11 నుంచి14 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు, మహబూబాబాద్ జిల్లాలో 14 నుంచి 17 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. వృద్దులు, చిన్న పిల్లలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.
News November 9, 2025
HNK: జాబ్ మేళాలో 214 మందికి ఉద్యోగాలు

హనుమకొండలోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్ స్కూల్లో సమగ్ర శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో ఒకేషనల్ విద్యార్థులకు జాబ్ మేళ నిర్వహించారు. ఇందులో 214 మందికి ఉద్యోగాలు పొందారని హనుమకొండ అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి వెల్లడించారు. జాబ్ మేళాకు 1200 మంది ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోగా 600 పైచిలుకు హాజరయ్యారన్నారు. 24 సంస్థలు వివిధ రంగాల్లో 214 మంది విద్యార్థులకు అపాయింటుమెంట్ పత్రాలు అందజేశారని తెలిపారు.
News November 9, 2025
పెండింగ్ డీఏలను వెంటనే చెల్లించండి: టీఐయూఎఫ్

ఉపాధ్యాయుల పెండింగ్ డీఏ బకాయిలను వెంటనే చెల్లించాలని తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టీఐయూఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు రామినేని వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. వరంగల్‌లోని కృష్ణ కాలనీ పాఠశాలలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మాట్లాడారు. రిటైర్డ్ టీచర్స్ బెనిఫిట్స్ చెల్లించాలని, సర్దుబాటును పారదర్శకంగా నిర్వహించాలని, ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులను టెట్ నుంచి మినహాయించాలని కోరారు.


