News June 22, 2024

వరంగల్ మార్కెట్‌కు రెండు రోజుల సెలవు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు 2 రోజులు సెలవులు రానున్నాయి. శనివారం వారాంతపు యార్డు బంద్, ఆదివారం సాధారణ సెలవు నేపథ్యంలో మార్కెట్ బంద్ ఉండనుంది. రైతులు విషయాన్ని గమనించి ఈ రెండు రోజులు మార్కెట్‌కి సరుకులు తీసుకొని రావద్దని, విషయాన్ని గమనించాలని అధికారులు సూచిస్తున్నారు.

Similar News

News November 8, 2024

రైతుల అభిప్రాయాలను నివేదికల్లో సమర్పించాలి: వరంగల్ కలెక్టర్

image

మామూనూరు ఎయిర్‌పోర్ట్ నిర్మాణంలో భూమి కోల్పోయిన రైతులతో వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి భూసేకరణలో భాగంగా రైతులతో అభిప్రాయ సేకరణలో భాగంగా గుంటూరుపల్లి, గాడిపల్లి, నక్కలపల్లి రైతులు భూమి కోల్పోయిన రైతుల అభిప్రాయాలను స్వీకరించాలన్నారు. వారి సలహాలు, సూచనల మేరకు నివేదికలు సమర్పించాలని తహశీల్దార్ నాగేశ్వర్‌ను ఆదేశించారు.

News November 8, 2024

వరంగల్: తగ్గిన మొక్కజొన్న ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు నేడు మొక్కజొన్న తరలివచ్చింది. ధర మాత్రం క్రమంగా తగ్గుతూ వస్తుంది. గురువారం రూ.2,470 పలికిన క్వింటా మొక్కజొన్న నేడు రూ.2,450కి పడిపోయింది. 2 నెలల క్రితం 3వేలకు పైగా పలికిన మక్కల ధర క్రమంగా తగ్గింది. మరోవైపు 5,531 రకం మిర్చికి నిన్నటిలాగే నేడు రూ.13 వేల ధర వచ్చింది.

News November 8, 2024

4వ డివిజన్ కన్వీనర్‌గా సురేందర్

image

ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి గ్రేటర్ వరంగల్ అధ్యక్షుడు పనికలా శ్రీనివాస్ ఆధ్వర్యంలో 4వ డివిజన్ కమిటీని ఈరోజు ఎన్నుకున్నామన్నారు. డివిజన్ కన్వీనర్‌గా సురేందర్, కో -కన్వీనర్లుగా వేల్పుల భిక్షపతి, తోగరి సారంగపాణి, బలిజ పృథ్వీ, రాజ్ కుమార్ తదితరులను ఎన్నుకున్నామని చెప్పారు. అనంతరం గ్రేటర్ కో-కన్వీనర్లు పొనగంటి లక్ష్మినారాయణ, కాళేశ్వరం రామన్న చేతుల మీదుగా నియామక పత్రం అందజేశారు.