News October 8, 2024

వరంగల్ మార్కెట్‌కు వరుస సెలవులు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి వరుసగా 4 రోజుల సెలవులు రానున్నాయి. ఈనెల 10న దుర్గాష్టమి, 11న మహార్ణవమి, 12న విజయదశమి, వారంతపు యార్డు బంద్, 13న ఆదివారం సాధారణ సెలవు నేపథ్యంలో మార్కెట్‌ను మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాబట్టి, రైతులు గమనించి 4 రోజులు సరుకులు తీసుకొని రావద్దని విజ్ఞప్తి చేశారు. తిరిగి సోమవారం మార్కెట్ ప్రారంభం అవుతుందన్నారు.

Similar News

News January 21, 2026

WGL: ఫిబ్రవరి 2 నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్

image

జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 2 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇంటర్ బోర్డు ఆదేశాల మేరకు జిల్లాలో 28 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ల్యాబ్‌లలో సీసీ కెమెరాలు అమర్చి బోర్డు సర్వర్‌కు అనుసంధానం చేశారు. పరీక్షల నిర్వహణను కమాండ్ కంట్రోల్ రూం నుంచి పర్యవేక్షించనున్నారు. ప్రతిరోజూ ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు ఉంటాయి.

News January 21, 2026

వరంగల్‌: ‘స్కాలర్‌షిప్‌ విద్యార్థులు ఆధార్‌ లింకు చేసుకోవాలి’

image

జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలల్లో 9, 10 తరగతులు చదువుతున్న విద్యార్థులు తమ బ్యాంక్ ఖాతాలను వెంటనే ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలని జిల్లా బీసీ సంక్షేమ అధికారి పుష్పలత సూచించారు. 2025-26 విద్యా సంవత్సరానికి గాను 1356 మంది బీసీ, ఈబీసీ విద్యార్థులు ప్రీ-మెట్రిక్ ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోగా, అందులో 872 మంది ఇంకా ఆధార్ లింకింగ్ పూర్తి చేయలేదని వెల్లడించారు.

News January 21, 2026

గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణకు పటిష్ఠ చర్యలు: వరంగల్ కలెక్టర్

image

జిల్లాలో గంజాయి, మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో పని చేసి యువత, విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని జిల్లా కలెక్టర్ డా.సత్య శారద తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. గంజాయి, ఇతర మత్తు పదార్థాల నియంత్రణకు పటిష్ఠ చర్యలు తీసుకోవడంతో పాటు, మత్తు పదార్థాలకు అలవాటు పడితే కలిగే నష్టాలపై ప్రజలకు, ముఖ్యంగా యువతకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.