News November 8, 2024
వరంగల్ మార్కెట్లలో పెరిగిన మిర్చి ధరలు
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లలో నేడు తేజ మిర్చి ధర పెరిగింది. గురువారం క్వింటాకు రూ.16,200 ధర రాగా.. నేడు రూ. 17,000 పలికింది. అలాగే 341 రకం మిర్చి క్వింటాకు నిన్న రూ.15 వేల ధర రాగా నేడు రూ. 14,500కి పడిపోయింది. మరోవైపు వండర్ హాట్ మిర్చికి నిన్న రూ.14,000 ధర రాగా, ఈరోజు రూ.500 పెరిగి రూ.14,500కి చేరిందని వ్యాపారులు తెలిపారు.
Similar News
News December 8, 2024
పరకాల: రోడ్డు ప్రమాదం.. చిన్నారి మృతి
రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాలు.. హసన్‌పర్తి మండలానికి చెందిన వేముల సుమన్ తన కుటుంబసభ్యులతో కలిసి ఆటోలో రేగొండ వైపునకు వెళుతున్నారు. ఈ క్రమంలో పరకాల సమీపంలో శుక్రవారం సాయంత్రం వాగు సమీపంలో వేగంగా వస్తున్న లారీ ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో సుమన్ కూతురు సాత్వికతో పాటు పలువురు గాయపడ్డారు. సాత్వికను ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు.
News December 7, 2024
వరంగల్ అభివృద్ధిపై ప్రత్యేక ఫోకస్: ఎంపీ కావ్య
వరంగల్ అభివృద్ధిపై ప్రజా ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టిందని ఎంపీ కడియం కావ్య అన్నారు. టెక్స్‌టైల్ పార్క్ సమీపంలో నిర్వహించిన సమావేశంలో ఎంపీ కావ్య మాట్లాడారు. ప్రజా ప్రభుత్వంలో నిత్యం పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం పని చేస్తోందన్నారు.
News December 7, 2024
వరంగల్: రేవంత్ పాలనలో జిల్లాలో కావాల్సింది ఏంటి?
రేవంత్ రెడ్డి CMగా ప్రమాణస్వీకారం చేసి ఏడాది గడిచింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మిగిలిన నాలుగేళ్లలో మామునూరు ఎయిర్పోర్ట్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఇన్నర్ రింగ్ రోడ్డు, టెక్స్టైల్ పార్క్ పూర్తి, పలు చోట్ల ఇంటిగ్రేటెడ్ విద్యాసంస్థలు, పలు ఐటీ, ఇతర ఇండస్ట్రీస్‌ను తీసుకురావాలని జిల్లా వాసులు కోరుతున్నారు. మిగిలిన నాలుగు ఏండ్లలో ఇంకా ఏ అభివృద్ధి పనులు చేపట్టాలో కామెంట్ చేయండి.