News January 30, 2025
వరంగల్ మార్కెట్లో అరుదైన మిర్చి ఉత్పత్తులు రాక

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు నేడు వివిధ రకాల అరుదైన మిర్చి ఉత్పత్తులు తరలివచ్చాయి. 1048 రకం మిర్చి రూ.12వేలు, డబ్బి బ్యాగడి మిర్చి రూ.18,500, నం.5 మిర్చి ధర రూ.13,500 పలికాయి. అలాగే 2043 మిర్చి రూ.13వేలు, 5531 మిర్చి రూ.11,200, 2043 మిర్చి రూ.14వేలు, 273 రకం మిర్చి రూ.12వేలు, 334 మిర్చి రూ.11,500, ఎల్లో మిర్చి రూ.16,500 ధర పలికినట్లు వ్యాపారులు తెలిపారు.
Similar News
News February 8, 2025
మేడారానికి బస్సు ప్రారంభం

మినీ మేడారం జాతర సందర్భంగా భక్తులకు బస్సు సర్వీస్ ప్రారంభమైంది. ఈ నెల 12 నుంచి 15వ తేదీ వరకు జరిగే మినీ మేడారం జాతరకు హనుమకొండ నుంచి తాడ్వాయి మీదుగా ప్రతి రోజు 6 ట్రిప్పులు బస్సులు నడపనున్నట్లు ఆర్ఎం తెలిపారు. మహిళలకు ఉచిత ప్రయాణం ఉందని భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. మంత్రి సీతక్క చొరవతో మహా జాతరకు బస్సు సౌకర్యం ఉన్నట్లు మినీ జాతరకు కూడా బస్సులు ఏర్పాట్లు చేశారు.
News February 8, 2025
నర్సంపేట: గుప్త నిధుల కోసం తవ్వకాలు

నర్సంపేట మండలం కమ్మపల్లి గ్రామంలో గుప్తనిధుల తవ్వకాల కలకలం రేపింది. గ్రామ శివారులో గుప్త నిధుల కోసం కొందరు వ్యక్తులు తవ్వకాలు చేస్తుండగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఇద్దరు ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక జేసీబీ , రెండు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
News February 8, 2025
వరంగల్ ఇన్‌ఛార్జి డీటీఓగా శోభన్ బాబు

వరంగల్ జిల్లా రవాణా శాఖ కార్యాలయ ప్రక్షాళనపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. నిన్న డీటీసీ శ్రీనివాస్ ఇళ్లల్లో ఏసీబీ దాడులు, అరెస్టు తర్వాత మరో అధికారిపై వేటు వేశారు. వరంగల్ డీటీఓ లక్ష్మిపై బదిలీ ప్రభుత్వం వేటు వేసిన తెలిసిందే. కాగా ఎంవీఐ శోభన్ బాబును వరంగల్ జిల్లా ఇన్‌ఛార్జిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.