News January 27, 2025
వరంగల్ మార్కెట్‌లో అరుదైన మిర్చి

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు నేడు వివిధ రకాల అరుదైన మిర్చి ఉత్పత్తులు తరలివచ్చాయి. 1048 రకం మిర్చి రూ.12వేలు పలకగా.. డబ్బి బ్యాగడి మిర్చి రూ.13వేలు పలికింది. అలాగే నం.5 మిర్చి ధర రూ.13,000, పాత తేజా మిర్చి ధర రూ.12,000, పాత వండర్ హాట్ మిర్చి రూ.12వేలు, 5531 మిర్చి రూ.12వేలు, 2043 మిర్చి రూ.14వేలు ధర పలికినట్లు వ్యాపారులు తెలిపారు.
Similar News
News February 6, 2025
భారత క్రికెట్‌కు లతా మంగేష్కర్ సాయం

గాన కోకిల లతా మంగేష్కర్ వర్ధంతి సందర్భంగా ఆమె టీమ్ఇండియాకు చేసిన సహాయం గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. జట్టు కోసం నిధుల సేకరణ కోసం ఢిల్లీలో 1983లో కన్సర్ట్ నిర్వహించారు. ఆమె సోదరుడు పండిత్ హృద్యనాథ్ స్వరపరిచిన ‘భారత్ విశ్వ విజేత’ సాంగ్‌ను లతా పాడారు. దీనికి కపిల్ దేవ్ టీమ్, సపోర్ట్ స్టాఫ్‌తో పాటు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హాజరయ్యారు. వచ్చిన రూ.20లక్షలను ఆమె ప్లేయర్లకు అందించారు.
News February 6, 2025
ఒక్క మెసేజ్‌తో స్పందించిన కోనసీమ కలెక్టర్

ఐ.పోలవరం మండలం జి.మూలపాలెం జడ్పీ స్కూలుకు కాట్రేనికోన మండలం బలుసుతిప్ప నుంచి 95 మంది విద్యార్థులు వస్తుంటారు. రోజూ పడవ ప్రయాణం చేసి పాఠశాలకు వెళ్లాల్సి ఉంటుంది. వీరి అవస్థలను HM జనార్ధనరావు వాట్సాప్ ద్వారా డీఈవో బాషాకు మెసేజ్ చేశారు. విద్యార్థులకు లైఫ్ జాకెట్లు కావాలని కోరారు. కలెక్టర్ మహేశ్ కుమార్‌తో డీఈవో మాట్లాడారు. 3 రోజుల్లోనే 95 మందికి లైఫ్ జాకెట్లు సమకూర్చారు.
News February 6, 2025
చెరుకుపల్లి వద్ద రోడ్డు ప్రమాదం

రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలైన ఘటన చెరుకుపల్లి మండలం గుళ్ళపల్లి గ్రామంలో గురువారం రాత్రి జరిగింది. రాజోలు గ్రామానికి చెందిన ముచ్చు నాగార్జున్‌రెడ్డి బైక్‌పై వెళ్తుండగా ఆటో ఢీకొంది. అనంతరం అతన్ని ఆటో కొంతదూరం ఈడ్చుకెళ్లినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో నాగార్జునరెడ్డి తలకు తీవ్రంగా గాయమైంది. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రుణ్ణి చెరుకుపల్లి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.