News January 24, 2025
వరంగల్ మార్కెట్‌లో ఉత్పత్తుల ధరలు

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు శుక్రవారం సైతం వివిధ రకాల అరుదైన మిర్చి ఉత్పత్తులు తరలివచ్చాయి. 1048 రకం మిర్చి రూ.12,500, అకిరా బ్యాగడి మిర్చి రూ.13 వేలు పలికింది. అలాగే పాత తేజ మిర్చి ధర రూ.14,000, పాత 341 రకం మిర్చి ధర రూ.15,500, పాత వండర్ హాట్ మిర్చి రూ.14,000, 5531 మిర్చి రూ.12 వేల ధర పలికినట్లు వ్యాపారులు తెలిపారు. సూక పల్లికాయ రూ.6,210, పచ్చిపల్లికాయ రూ.4 వేలు పలికాయి.
Similar News
News February 16, 2025
WGL: 19 మందిలో ఒక్కరే మహిళా అభ్యర్థి

వరంగల్ -ఖమ్మం -నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచిన 19 మంది అభ్యర్థులలో కేవలం ఒక్కరే మహిళా అభ్యర్థి ఉన్నారు. నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం వేంపాడు గ్రామానికి చెందిన అర్వ స్వాతి బరిలో నిలిచిన అతి చిన్న వయస్కురాలిగా (34 ఏళ్లు) ఉన్నారు. 68 ఏళ్ల వయసుతో హనుమకొండ జిల్లా దామరకు చెందిన దామర బాబురావు పెద్ద వయస్కుడిగా బరిలో ఉన్నారు. ఫిబ్రవరి 27 తేదీ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది.
News February 16, 2025
వరంగల్: భర్త దశదిన కర్మ పూర్తవ్వక ముందే భార్య మృతి

భర్త దశదిన కర్మ పూర్తవ్వక ముందే భార్య మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా గురజాలలో జరిగింది. మెట్టు మల్లయ్య(78)కు పది రోజుల క్రితం గుండెపోటు వచ్చింది. ఆయన్ను వరంగల్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అదేరోజు ఆయన భార్య సమ్మక్క(69) అస్వస్థతకు గురి కాగా ఆసుపత్రిలో చేర్చారు. ఈ నెల 6వ తేదీన మల్లయ్య మృతి చెందగా, శనివారం సమ్మక్క మృతి చెందింది. దీంతో ఆ కుటుంబంలో, గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
News February 16, 2025
MPTC, ZPTC ఎన్నికలు: వరంగల్ జిల్లా UPDATES

వరంగల్ జిల్లా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు-2025కు సంబంధించిన తుది పోలింగ్ కేంద్రాల జాబితాను అధికారులు శనివారం విడుదల చేశారు. జిల్లాలో మొత్తం 13 మండలాలు ఉండగా, వరంగల్, ఖిలా వరంగల్ గ్రేటర్ పరిధిలో ఉన్నాయి. 694 పోలింగ్ కేంద్రాలను ఫైనల్ చేశారు. మొత్తం 130 ఎంపీటీసీ స్థానాలకు, 11 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. వరంగల్ జిల్లాలో మొత్తం 3,85,162 మంది ఓటర్లు ఉన్నారు.