News September 24, 2024

వరంగల్ మార్కెట్లో చిరుదాన్యాల ధరలు ఇలా..

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నేడు వివిధ రకాల ఉత్పత్తుల ధరలు ఇలా ఉన్నాయి. సూక పల్లికాయ ధర రూ.6 వేలు పలకగా, పచ్చి పల్లికాయ రూ.4,400 పలికింది. అలాగే 5531 రకం మిర్చికి రూ.14,000 ధర, పసుపునకు రూ.13,767 వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు. కాగా, నేడు మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగాయి.

Similar News

News October 4, 2024

మలుగు: రోడ్డుపై భారీ కొండచిలువ

image

ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రం నుంచి కుమ్మరిగూడెం వెళ్లే ప్రధాన రహదారిపై భారీ కొండచిలువ గురువారం రాత్రి ప్రత్యక్షమైంది. దీంతో అటుగా వెళ్తున్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. సుమారు 10 అడుగుల పొడవు ఉందని స్థానికులు తెలిపారు. కాగా ప్రయాణికుల చప్పుడుతో పొదల్లోకి వెళ్లిపోయినట్లు పేర్కొన్నారు. దీంతో ప్రయాణికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.

News October 3, 2024

వరంగల్: నేడు ఎస్జీటీ అభ్యర్థులకు సర్టిఫికెట్ పరిశీలన

image

వరంగల్ జిల్లా ఎస్జీటీ 1:3 నిష్పత్తిలో భాగంగా గురువారం 271 నుంచి 435 మంది అభ్యర్థులకు సర్టిఫికెట్ పరిశీలన ఉంటుందని జిల్లా విద్యాశాఖ అధికారి మామిడి జ్ఞానేశ్వర్ తెలిపారు. నిన్న సర్టిఫికెట్ పరిశీలనకు రాని అభ్యర్థులు.. ఈరోజు కూడా అటెండ్ అవ్వవచ్చన్నారు. అభ్యర్థులు వచ్చే ముందు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు సంబంధిత గెజిటెడ్ సంతకంతో సర్టిఫికెట్లన్నీ తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలని అన్నారు.

News October 3, 2024

ములుగు: పాముకాటుతో మూడేళ్ల బాలుడు మృతి

image

పాముకాటుతో మూడేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. శంకరాజుపల్లి గ్రామానికి చెందిన సుమన్, మానస దంపతుల కుమారుడు గగన్(3) చిన్నబోయినపల్లిలోని తన బంధువుల ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం పాము కాటు వేసింది. గమనించిన కుటుంబీకులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఎంజీఎం తరలించగా పరిస్థితి విషమించి నేడు మృతి చెందాడు.