News November 12, 2024
వరంగల్ మార్కెట్లో చిరుదాన్యాల ధరలు ఇలా

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం వివిధ రకాల చిరుధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. నిన్న పసుపు క్వింటాకి రూ.11,427 ధర రాగా నేడు రూ.11,781 ధర వచ్చింది. అలాగే మక్కలు బిల్టి క్వింటాకి నిన్న రూ.2,495 ధర పలకగా నేడు రూ.2,465 ధర పలికింది. మరోవైపు సూక పల్లికాయకు సోమవారం రూ.5,510 ధర రాగా ఈరోజు రూ.5,900 ధర వచ్చింది.
Similar News
News November 28, 2025
HNK: నందనం గణేష్‌కు కర్మవీర్ చక్ర అవార్డులో బ్రాంజ్ మెడల్

హనుమకొండ జిల్లా ఐనవోలు నందనం గ్రామానికి చెందిన యువ ఆవిష్కర్త యాకర గణేష్ ప్రతిష్ఠాత్మక కర్మవీర్ చక్ర అవార్డ్స్‌లో బ్రాంజ్ మెడల్‌ను అందుకున్నారు. నవంబర్ 26న ఫరీదాబాద్‌లో యూ.ఎన్ భాగస్వామ్యంతో జరిగిన కార్యక్రమంలో ఆయనకు ఈ అవార్డు దక్కింది. సాంకేతిక ఆవిష్కరణలు, పౌర చైతన్యం ద్వారా ప్రజల జీవితాల్లో మార్పు తెస్తున్నందుకు గణేష్‌ను సన్మానించారు.
News November 28, 2025
‘టీఈ-పోల్’ యాప్ వినియోగించండి: వరంగల్ కలెక్టర్

ఓటర్లకు గ్రామ పంచాయతీ ఎన్నికల సమాచారం సులభంగా చేరేందుకు రూపొందించిన టీఈ-పోల్ మొబైల్ యాప్‌ను వినియోగించాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద సూచించారు. కలెక్టరేట్‌లో విలేకరులతో మాట్లాడిన ఆమె, గూగుల్ స్టోర్‌లో యాప్ అందుబాటులో ఉందని తెలిపారు. పోలింగ్ కేంద్రం, ఓటర్ స్లిప్ వంటి వివరాలను యాప్ ద్వారా తెలుసుకోవచ్చని, ప్రతి ఓటరు స్వేచ్ఛగా ఓటు వేయాలని, ఎన్నికల్లో చురుకుగా పాల్గొనాలని కోరారు.
News November 27, 2025
వరంగల్: కొత్త విత్తన బిల్లుపై అభిప్రాయాలు సేకరించిన కలెక్టర్

కొత్త విత్తన బిల్లు-2025 ముసాయిదాపై రైతులు, విత్తన వ్యాపారులు, ఉత్పత్తిదారుల అభిప్రాయాలను సేకరించామని జిల్లా కలెక్టర్ డా.సత్య శారద తెలిపారు. ఈరోజు వరంగల్ కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి సంప్రదింపుల సమావేశంలో బిల్లులోని సెక్షన్లు, క్లాజులపై విస్తృతంగా చర్చించారు. హాజరైన వాటాదారులు ప్రతి అంశంపై తమ సూచనలు తెలియజేశారు. వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.


