News November 12, 2024
వరంగల్ మార్కెట్లో చిరుదాన్యాల ధరలు ఇలా
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం వివిధ రకాల చిరుధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. నిన్న పసుపు క్వింటాకి రూ.11,427 ధర రాగా నేడు రూ.11,781 ధర వచ్చింది. అలాగే మక్కలు బిల్టి క్వింటాకి నిన్న రూ.2,495 ధర పలకగా నేడు రూ.2,465 ధర పలికింది. మరోవైపు సూక పల్లికాయకు సోమవారం రూ.5,510 ధర రాగా ఈరోజు రూ.5,900 ధర వచ్చింది.
Similar News
News December 14, 2024
HNK: త్వరలో జూపార్క్‌కు తెల్లపులులు, సింహం
హంటర్ రోడ్డులోని కాకతీయ జూలాజికల్ పార్క్‌కు త్వరలో మరిన్ని జంతువులు రానున్నాయి. సింహంతో పాటు రెండు తెల్లపులులను తెప్పించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే జూ పార్క్‌కు రెండు పులులు కరీనా, శంకర్ వచ్చాయని, త్వరలో రెండు అటవీ దున్నలు(బైసన్‌లు) రానున్నట్లు భద్రాద్రి జోన్ సీపీఎఫ్ భీమానాయక్ చెప్పారు. వచ్చే ఏడాది మరిన్ని జంతువులు జూపార్క్‌కు తీసుకురానున్నట్లు పేర్కొన్నారు.
News December 14, 2024
కొమరవెల్లి మల్లన్న హుండీ లెక్కింపు
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెళ్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి హుండీ ఆదాయాన్ని ఆలయ అధికారులు శుక్రవారం లెక్కించారు. స్వామి వారికి 73 రోజుల్లో రూ.81,68,044 హుండీ ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. 146 గ్రాముల మిశ్రమ బంగారం, 5 కిలోల 200 గ్రాముల మిశ్రమ వెండి, 26 విదేశీ నోట్లు, మిశ్రమ బియ్యం 550 కేజీలు వచ్చాయన్నారు.
News December 13, 2024
గ్రూప్-II పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు: WGL సీపీ
వరంగల్ పోలీస్ కమిషనరేట్ జిల్లా పరిధిలో రేపు డిసెంబర్ 15 నుంచి 16 వరకు జరిగే TGPSC గ్రూప్-II నిర్వహించే పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS యాక్ట్-2023(భారతీయ నాగరిక్ సురక్షా సంహిత) అమలులో ఉంటుందని సీపీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. సభలు, సమావేశాలు, ర్యాలీ నిషేధమని, అతిక్రమిస్తే చర్యలు తప్పవని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఓ ప్రకటనలో తెలిపారు.