News January 20, 2025

వరంగల్ మార్కెట్లో చిరుధాన్యాల ధరలు ఇలా

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి చిరుధాన్యాలు సోమవారం తరలిరాగా ధరలు ఇలా ఉన్నాయి. సూక పల్లికాయ క్వింటాకు రూ.6310 ధర పలకగా.. పచ్చి పల్లికాయ ధర రూ.4450 పలికింది. అలాగే కందులు రూ.7,100 పలికినట్లు వ్యాపారస్తులు తెలిపారు. చలికాలం నేపథ్యంలో రైతులు తేమ లేని నాణ్యమైన సరుకులు మార్కెట్‌కు తీసుకొని రావాలని అధికారులు సూచిస్తున్నారు.

Similar News

News November 15, 2025

WGL: టెన్త్ పరీక్షల ఫీజు గడువు 20 వరకు పొడిగింపు

image

పదో తరగతి వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఈనెల 20 వరకు పొడిగించినట్లు డీఈఓ రంగయ్య నాయుడు తెలిపారు. రూ.50 అపరాధ రుసుముతో 21 నుంచి 29 వరకు ఫీజులు చెల్లించవచ్చన్నారు. అన్ని సబ్జెక్టులకు రూ.125, మూడు సబ్జెక్టులకు రూ.110, 3 కంటే ఎక్కువైతే రూ.125, వొకేషనల్ వారికి అదనంగా రూ.60 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఫీజులు కేవలం www.bse.telangana.gov.inలో లాగిన్ ద్వారా చెల్లించాలని సూచించారు.

News November 15, 2025

పాకాల: ధాన్యం కొనుగోళ్లలో కఠిన నిబంధనలు..!

image

వరంగల్ జిల్లా పాకాల ఆయకట్టు పరిధిలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కాకుండానే రైతులకు ఇబ్బందులు పెరుగుతున్నాయి. జల్లెడ వేసిన ధాన్యానికే టోకెన్లు ఇవ్వాలని ఉన్నతాధికారుల ఆదేశాలు రావడంతో రైతులు తీవ్ర అసౌకర్యం ఎదుర్కొంటున్నారు. తాలు, మట్టి, పాడైన ధాన్యం 5% లోపే ఉండాలన్న నిబంధనలు, మిల్లర్ల కేటాయింపు ఆలస్యం రైతులకు తలనొప్పిగా మారాయి. నిబంధనలు పాటించకపోతే కొనుగోలు చేయబోమని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

News November 15, 2025

మహబూబాబాద్: ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు

image

విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు మహబూబాబాద్ టౌన్ ఇన్‌స్పెక్టర్ మహేందర్ రెడ్డి తెలిపారు. MHBD పట్టణం కంకర బోర్డులోని జడ్పీ హై స్కూల్లో సోషల్ టీచర్‌గా పని చేస్తున్న రవి 10 రోజులుగా ఓ విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని తల్లితో చెప్పింది. ఆమె ఫిర్యాదుతో టీచర్‌పై పోక్సో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ పేర్కొన్నారు.