News March 21, 2025
వరంగల్ మార్కెట్లో చిరుధాన్యాల ధరలు ఇలా

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం పలురకాల మిర్చి ఉత్పత్తుల ధరలు ఇలా ఉన్నాయి. 5531 మిర్చి క్వింటాకు రూ.11,000 ధర పలకగా.. టమాటా మిర్చికి రూ.27,500 ధర, సింగిల్ పట్టికి రూ.30వేలు ధర పలికినట్లు వ్యాపారులు తెలిపారు. అలాగే మక్కలు బిల్టీ రూ.2310, సూక పల్లికాయ రూ.7700, పచ్చి పల్లికాయ రూ.4350 ధర వచ్చినట్లు పేర్కొన్నారు.
Similar News
News November 7, 2025
చరిత్ర సృష్టించిన శీతల్.. సాధారణ ఆర్చర్లతో పోటీ

పారా కాంపౌండ్ ఆర్చరీలో శీతల్ దేవి వరల్డ్ ఛాంపియన్‌గా నిలవడమే కాకుండా అనేక పతకాలు గెలిచారు. ఆమె ఇప్పుడు మరో అరుదైన ఘనత సాధించారు. సాధారణ ఆర్చర్లతో కలిసి ఆసియా కప్‌లో పాల్గొనేందుకు అర్హత సాధించారు. జెడ్డా వేదికగా జరగనున్న ఆసియా కప్ స్టేజ్-3లో పోటీ పడే భారత జట్టుకు ఎంపికయ్యారు. సాధారణ ఆర్చర్ల జట్టులోకి పారా ఆర్చర్ ఎంపికవ్వడం ఇదే తొలిసారి కావడం విశేషం. ట్రయల్స్‌లో ఆమె ఓవరాల్‌గా 3వ స్థానంలో నిలిచారు.
News November 7, 2025
SUPER.. కర్నూలు ప్రిన్సిపల్‌కు 43 అవార్డులు

కర్నూలు బి క్యాంప్ ప్రభుత్వ వొకేషనల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్.నాగస్వామి నాయక్ విద్యా, సేవా రంగాల్లో చేసిన విశిష్ఠ కృషికి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ (UNO) ప్రశంసా పత్రం అందుకున్నారు. ఈ అవార్డును గురువారం కర్నూలు ఎంపీ నాగరాజు చేతుల మీదుగా స్వీకరించారు. నాయక్ ఇప్పటివరకు 43 జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు. కళాశాల ఉత్తీర్ణత శాతం 82.08% సాధించడంలో కీలక పాత్ర వహించారు.
News November 7, 2025
నంద్యాల: ఉచితంగా స్కూటీలు

దివ్యాంగుల సంక్షేమానికి CM చంద్రబాబు కృషి చేస్తున్నారని ప్రభుత్వ టెలికాం అడ్వైజరి కమిటీ మెంబర్ రమేశ్ పేర్కొన్నారు. గురువారం పాములపాడులో మీడియాతో ఆయన మాట్లాడారు. దివ్యాంగులకు ఉచితంగా రెట్రో పిట్టెడ్ మోటార్ సైకిల్స్‌ను సీఎం ఉచితంగా అందజేస్తున్నారన్నారు. అర్హులైన దివ్యాంగులు ఈనెల 25వ తేదీ లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు www.apdascac.ap.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు.


