News April 2, 2025
వరంగల్ మార్కెట్లో చిరుధాన్యాల ధరలు

వరంగల్ ఎనుమాముల మార్కెట్లో బుధవారం చిరుధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. సూక పల్లికాయ క్వింటా ధర రూ.5,900, పచ్చి పల్లికాయ రూ.4,850 పలికింది. పసుపు (కాడి) క్వింటా ధర రూ.12,359, పసుపు (గోల)కి రూ.10,729 వచ్చింది. మరోవైపు మక్కలు (బిల్టీ) క్వింటా ధర రూ.2,285 పలికినట్లు అధికారులు వెల్లడించారు.
Similar News
News November 28, 2025
పల్నాడు జిల్లాలో మున్సిపాలిటీలకు పుడా నిధులు

పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ జిల్లా పరిధిలోని మున్సిపాలిటీల అభివృద్ధికి రూ. 2.60 కోట్లు నిధులు కేటాయించింది. నరసరావుపేట మున్సిపాలిటీకి రూ.25 లక్షలు, దాచేపల్లి రూ.25 లక్షలు, గురజాల రూ.25 లక్షలు, మాచర్ల రూ.45 లక్షలు, పిడుగురాళ్ల రూ.50 లక్షలు, వినుకొండ రూ.40 లక్షలు, చిలకలూరిపేటకు రూ.50 లక్షలు కేటాయించారు. ఈ నిధులను మున్సిపాలిటీలలో మౌలిక సదుపాయాలు, అభివృద్ధికి వినియోగించనున్నారు.
News November 28, 2025
SRCL: మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేసినట్లు ఇన్ఛార్జ్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగర్వాల్ తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శుక్రవారం మొదటి విడత ర్యాండమైజెషన్ ప్రక్రియను ఇన్ఛార్జ్ కలెక్టర్ నేతృత్వంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారులు పాల్గొన్నారు.
News November 28, 2025
అదనపు డబ్బులు వసూలు చేస్తే చర్యలు: JC

కేంద్ర ప్రభుత్వం ఉజ్వల పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్ లేని పేదలకు గ్యాస్ కనెక్షన్, మొదటి గ్యాస్ సిలిండర్ను సైతం ఉచితంగా అందజేయడం జరుగుతుందని JC గోపాలకృష్ణ అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం దీపం కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో మాట్లాడుతూ.. గ్యాస్ డెలివరీ చేసే సమయంలో అదనపు డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, బాధ్యులైనవారిపై చర్యలు తీసుకుంటామన్నారు.


