News October 17, 2024
వరంగల్ మార్కెట్లో చిరుధాన్యాల ధరల వివరాలు

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో గురువారం వివిధ రకాల చిరు ధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. సూక పల్లికాయ నిన్న రూ.6,640 ధర పలకగా.. నేడు రూ.5560కి పడిపోయింది. అలాగే 5531 రకం మిర్చికి నిన్నటి లాగే రూ.13,500 ధర రాగా నేడు కూడా అదే ధర వచ్చిందని వ్యాపారులు తెలిపారు. మక్కలు(బిల్టీ) ధర నిన్న రూ. 2416 ధర పలకగా.. నేడు రూ.2420 పలికింది.
Similar News
News November 27, 2025
వరంగల్: పంచాయతీ ఎన్నికలు.. కలెక్టర్ సమీక్ష

వరంగల్ జిల్లా పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను మరింత పటిష్ఠంగా సమీక్షించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నియమించిన రాష్ట్ర బీసీ సంక్షేమ కమిషనర్, జిల్లా పరిశీలకురాలు బి.బాల మాయదేవి (IAS) వరంగల్ కలెక్టరేట్కు చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద పూలమొక్క అందించి ఆమెకు ఘన స్వాగతం పలికారు. తర్వాత కలెక్టరేట్ ఛాంబర్లో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

వరంగల్: ఏడాది గడిచినా వేతనాలు అందని దుస్థితి!

ఇంటింటి కుటుంబ సర్వే పూర్తై ఏడాది గడిచినా ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు వేతనాలు అందక నిరాశ వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ జిల్లాలో 1.79 లక్షల కుటుంబాలపై 1200 మంది ఎన్యుమరేటర్లు, 119 మంది సూపర్వైజర్లు పనిచేశారు. ఎన్యుమరేటర్లకు రూ.10వేలు, సూపర్వైజర్లకు రూ.12వేలు, డాటా ఎంట్రీ ఆపరేటర్లకు ప్రతి దరఖాస్తుకు రూ.30 చొప్పున ఇవ్వాలని నిర్ణయించినా చెల్లింపులు నిలిచిపోవడంపై ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.