News October 29, 2024
వరంగల్ మార్కెట్లో చిరుధాన్యాల ధరలు ఇలా!

వరంగల్ నగరంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మంగళవారం వివిధ రకాల చిరుధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. సూక పల్లికాయ క్వింటాకి నిన్న రూ.5,950 ధర రాగా.. నేడు రూ.4,600 ధర పలికింది. 5531 రకం మిర్చికి నిన్నటిలాగే రూ.13వేలు ధర వచ్చింది. అలాగే పసుపు క్వింటాకు సోమవారం రూ.10,859 ధర రాగా.. నేడు రూ.10,939 ధర వచ్చింది. మక్కలు బిల్టీ క్వింటాకి రూ.2,550 ధర పలికిందని అధికారులు తెలిపారు.
Similar News
News July 10, 2025
వరంగల్: యూరియా కొరత.. నాట్లు వేసేదెలా?

ఉమ్మడి వరంగల్ జిల్లాలో యూరియా కొరత రైతులను వేధిస్తోంది. గత ఏడాదితో పోలిస్తే ఇంకా 50 శాతం యూరియా జిల్లాకు రావాల్సి ఉందని వ్యవసాధికారులు చెబుతున్నారు. అయితే నారుమళ్లలో వరి నారు ముదిరిపోతోందని రైతులు దిగులు చెందుతున్నారు. సకాలంలో యూరియా అందజేస్తే వరి నాట్లు వేసుకుంటామని రైతులు అంటున్నారు. యూరియా అందక వర్షాలు పడక నారు మళ్లలోనే వరినారు ఎండిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
News July 10, 2025
పర్వతగిరి: హే మహాత్మా.. శిథిలావస్థకు గాంధీ విగ్రహం..!

పర్వతగిరి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. ఎన్నో ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన విగ్రహం ఎవరూ పట్టించుకోకపోవడంతో సిమెంట్ పెచ్చులూడి లోపల ఉన్న ఇనుప చువ్వలు బయటకు తేలుతున్నాయి. ప్రధాన కూడలిలో గాంధీ విగ్రహం శిథిలావస్థకు చేరి కనిపిస్తున్నా ఎవరూ పట్టించుకోకపోవడం విడ్డూరం. పలువురు గ్రామస్థులు శిథిలావస్థకు చేరిన విగ్రహాన్ని చూసి “హే మహాత్మా” అని వాపోతున్నారు.
News July 9, 2025
డ్రాప్ అవుట్ విద్యార్థులు ఓపెన్ స్కూల్‌లో చదవాలి: కలెక్టర్

విద్యలో డ్రాప్ అవుట్ అయిన విద్యార్థులు ఓపెన్ స్కూల్ ద్వారా టెన్త్, ఇంటర్మీడియట్ పూర్తి చేయాలని వరంగల్ కలెక్టర్ సత్య శారదా దేవి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ చేతుల మీదుగా ఓపెన్ స్కూల్ క్యాలెండర్ పోస్టర్ ఆవిష్కరించారు. నిరక్షరాస్యులు ఉల్లాస్ కార్యక్రమంలో భాగస్వాములై అక్షరాస్యులుగా మారాలని కొరారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో రామ్ రెడ్డి, డీఈఓ జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు.