News January 2, 2025

వరంగల్ మార్కెట్‌లో చిరు ధాన్యాల ధరలు ఇలా..

image

వరంగల్ నగరంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు గురువారం వివిధ రకాల చిరు ధాన్యాలు తరలి రాగా ధరలు ఇలా ఉన్నాయి. సూక పల్లికాయ క్వింటాకు రూ.7,200 ధర పలకగా, పచ్చి పల్లికాయ రూ.4,680 ధర పలికింది. అలాగే పసుపు క్వింటాకు రూ.11,329 ధర పలికింది. కాగా మంగళవారంతో పోలిస్తే పల్లికాయ ధరలు పెరగగా పసుపు ధర స్వల్పంగా తగ్గింది.

Similar News

News November 21, 2025

సమర్థవంతంగా చేరేలా సమన్వయంతో పని చేయాలి: వర్ధన్నపేట ఎమ్మెల్యే

image

వరంగల్ జిల్లాలోని ప్రజలకు నాణ్యమైన సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు ప్రతి శాఖ సమన్వయంతో పనిచేయాలని అధికారులకు ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు సూచించారు. వరంగల్ దిశా కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రహదారి నిర్మాణాలు, కల్వర్టులు, గ్రామీణ అభివృద్ధి పనుల్లో ఎలాంటి ఆలస్యం లేకుండా నిర్దిష్ట కాలానికి పూర్తిచేయాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు విషయంలో పారదర్శకత పాటించాలన్నారు.

News November 21, 2025

వరంగల్: కలెక్టర్‌కు ఎమ్మెల్సీ సారయ్య శుభాకాంక్షలు

image

దక్షిణ భారతదేశంలో జల సంరక్షణ కేటగిరి-2లో వరంగల్ జిల్లాకు మొదటి స్థానం దక్కిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం MLC బసవరాజు సారయ్య వరంగల్ జిల్లా కలెక్టర్ డా.సత్య శారదను అభినందించి, శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాలో జల సంరక్షణ చర్యలను విజయవంతంగా చేపట్టి రాష్ట్రానికి ప్రతిష్ఠ తెచ్చారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో 20వ డివిజన్ కార్పొరేటర్ గుండెటి నరేంద్ర కుమార్ తదితరులు ఉన్నారు.

News November 20, 2025

వరంగల్: ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు: కలెక్టర్

image

వరంగల్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డా. సత్య శారద అధికారులను ఆదేశించారు. జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. తనిఖీల కోసం చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి, నిరంతరం పర్యవేక్షించాలన్నారు. అనుమతి లేని ఇసుక రవాణాపై కేసులు నమోదు చేసి, వాహనాలను స్వాధీనం చేసుకోవాలని సూచించారు. విజిలెన్స్ బృందాలను మరింత బలోపేతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.