News January 23, 2025
వరంగల్ మార్కెట్లో తగ్గిన మిర్చి ధరలు

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారంతో పోలిస్తే మిర్చి ధరలు తగ్గాయి. క్వింటా తేజ మిర్చి ధర బుధవారం రూ.14,600 ధర పలకగా.. నేడు రూ.14,300కి పడిపోయింది. అలాగే వండర్ హాట్ మిర్చికి బుధవారం రూ.15,000 ధర రాగా.. నేడు రూ.13,500కి పతనమైంది. మరోవైపు 341 రకం మిర్చికి నిన్నటిలాగే రూ.15,500 ధర వచ్చినట్లు అధికారులు తెలిపారు.
Similar News
News November 24, 2025
జగిత్యాల: ‘మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు’

ఇందిరమ్మ చీరల పంపిణీ, వడ్డీ లేని రుణాలపై వీడియో కాన్ఫరెన్స్లో జిల్లాల కలెక్టర్లతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష సమావేశం నిర్వహించారు. మూడో విడతగా 3,57,098 మహిళా సంఘాలకు రూ.304 కోట్ల రుణాలు విడుదల చేసినట్లు తెలిపారు. రేపు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో భారీగా రుణాల పంపిణీ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీచేశారు. జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్, అధికారులు పాల్గొన్నారు.
News November 24, 2025
బీసీలకు రాహుల్ గాంధీ అన్యాయం: కేటీఆర్

తెలంగాణ బీసీలకు రాహుల్ గాంధీ చేసిన అన్యాయాన్ని ఢిల్లీలో ఎండగడతామని KTR అన్నారు. ‘ఆయన వెంటనే BC రిజర్వేషన్ల అంశాన్ని పార్లమెంటులో చర్చకు వచ్చేలా చూడాలి. BJP సహకరించకుంటే ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టాలి. స్థానిక సంస్థల రిజర్వేషన్ల చుట్టే మొత్తం అంశాన్ని తిప్పుతూ బీసీల విద్య, ఉపాధి, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 42% రిజర్వేషన్ ఇచ్చే అంశాన్ని పక్కనపెట్టారు’ అని కార్యకర్తల సమావేశంలో విమర్శించారు.
News November 24, 2025
జిల్లా పోలీస్ కార్యాలయానికి 62 ఆర్జీలు: SP

బాపట్ల పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 62 ఆర్జీలు వచ్చినట్లు SP ఉమామహేశ్వర్ చెప్పారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వద్ద నేరుగా ఆయన వినతి పత్రాలు స్వీకరించారు. అనంతరం వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితుల సమస్యలు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి పరిష్కరించి నివేదిక అందజేయాలని సిబ్బందిని ఆదేశించారు.


