News February 4, 2025
వరంగల్ మార్కెట్లో తగ్గిన మిర్చి ధరలు

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారంతో పోలీస్తే ఈరోజు వివిధ రకాల మిర్చి ధరలు తగ్గాయి. సోమవారం క్వింటా తేజ మిర్చి ధర రూ. 13,900 పలకగా నేడు రూ.13,500 పలికింది. అలాగే 341 రకం మిర్చికి నిన్న రూ.14,500 పలకగా ఈరోజు రూ.14,200కి పడిపోయింది. మరోవైపు వండర్ హాట్ (WH) మిర్చికి నిన్న రూ.14,800 ధర రాగా.. నేడు రూ.15వేలకు చేరింది.
Similar News
News November 16, 2025
కుష్ఠు వ్యాధి గుర్తింపుపై స్పెషల్ డ్రైవ్: కలెక్టర్

జిల్లాలో కుష్ఠు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా కుష్టు వ్యాధిని గుర్తించేందుకు రేపటి నుంచి 30 వరకు 14 రోజుల ప్రత్యేక డ్రైవ్ను చేపడుతున్నట్లు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అన్నారు. ఈ డ్రైవ్లో ఆరోగ్య బృందాలు ప్రతి ఇంటినీ సర్వే చేస్తాయి. కుష్ఠును పూర్తిగా నయం చేయగలిగేదని, ప్రారంభంలో గుర్తించడం అత్యంత కీలకమని కలెక్టర్ తెలిపారు. ఎటువంటి లక్షణాలు ఉన్నా పరీక్షించుకోవాలని సూచించారు.
News November 16, 2025
కాకినాడ కలెక్టరేట్లో రేపు PGRS

కాకినాడ కలెక్టరేట్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పీజీఆర్ఎస్ (ప్రజా సమస్యల పరిష్కార వేదిక) కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ షాన్మోహన్ తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. ఈ కార్యక్రమానికి రాలేనివారు ఆన్లైన్లో కూడా తమ అర్జీలను నమోదు చేసుకోవచ్చని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
News November 16, 2025
రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

AP: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని APSDMA వెల్లడించింది. దీని ప్రభావంతో రేపు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.


