News February 4, 2025
వరంగల్ మార్కెట్లో తగ్గిన మిర్చి ధరలు

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో సోమవారంతో పోలీస్తే ఈరోజు వివిధ రకాల మిర్చి ధరలు తగ్గాయి. సోమవారం క్వింటా తేజ మిర్చి ధర రూ. 13,900 పలకగా నేడు రూ.13,500 పలికింది. అలాగే 341 రకం మిర్చికి నిన్న రూ.14,500 పలకగా ఈరోజు రూ.14,200కి పడిపోయింది. మరోవైపు వండర్ హాట్ (WH) మిర్చికి నిన్న రూ.14,800 ధర రాగా.. నేడు రూ.15వేలకు చేరింది.
Similar News
News February 15, 2025
KMR: లైంగిక దాడులను అరికట్టాలి: అదనపు కలెక్టర్

పాఠశాలలలో పిల్లలపై జరిగే లైంగిక దాడులను అరికట్టే దిశగా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ సూచించారు. కలెక్టరేట్‌లో ఫోక్సో చట్టంపై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ హాజరై.. చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్‌కి బ్యాడ్జీలు ప్రధానం చేశారు. జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల, తదితరులు పాల్గొన్నారు.
News February 15, 2025
అమ్మడు లైనప్ అదిరిందిగా!

‘మిస్టర్ బచ్చన్’తో హీరోయిన్ భాగ్యశ్రీబోర్సే టాలీవుడ్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. సినిమా పెద్దగా ఆడకపోయినా ఈ బ్యూటీ నటనకి మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ఈ క్రేజ్‌తో వరుస సినిమాల్లో ఛాన్సులు కొట్టేశారు. రామ్ పోతినేని సరసన RAPO22, దుల్కర్ సల్మాన్ ‘కాంత’లో నటిస్తున్నారు. విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’లో ఆమె కనిపిస్తారని సమాచారం. దీంతో ఈ అమ్మడి లైనప్ అదిరిపోయిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
News February 15, 2025
మెడికల్ కళాశాల సందర్శించిన కలెక్టర్ దినేష్ కుమార్

అల్లూరి జిల్లా పాడేరు మెడికల్ కళాశాలను కలెక్టర్ దినేశ్ కుమార్ శనివారం సందర్శించారు. అనాటమీ, వయ కెమిస్ట్రీ, హిస్టాలజీ ల్యాబ్ బోధనా తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులతో సామాజిక సేవ క్లబ్, సాంస్కృతి కార్యక్రమాల క్లబ్ ఏర్పాటు చేయాలని సూచించారు. బ్లాక్ 1 ఏప్రిల్‌లోను, బ్లాక్ 2 ఆగస్టు, బ్లాక్ 3 జూన్‌లోను పూర్తి చేస్తామని ఇంజనీరింగ్ అధికారులు కలెక్టర్‌కు తెలిపారు.