News February 17, 2025

వరంగల్ మార్కెట్‌లో తగ్గిన పత్తి ధర

image

రెండు రోజుల సాధారణ సెలవుల అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఈరోజు పునః ప్రారంభమైంది. ఈ క్రమంలో మార్కెట్‌కు పత్తి తరలి రాగా ధర మాత్రం గతవారంతో పోలిస్తే భారీగా తగ్గింది. గతవారం మొదట్లో క్వింటా పత్తి ధర రూ.7,060 పలకగా.. శుక్రవారం రూ.6,820కి చేరింది. ఈరోజు మరింత తగ్గి రూ.6,800కి పడిపోయినట్లు వ్యాపారులు తెలిపారు.

Similar News

News November 16, 2025

ఇంటి వస్తువులను పాదబాటలపై పెట్టవచ్చా?

image

జనరేటర్లు, షెడ్లను పాదబాటలపై ఏర్పాటు చేయడం వాస్తు విరుద్ధమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. వాన, ఎండ నుంచి రక్షణ కోసం పాదబాటలపై షెడ్ వేసినా, అది ప్రజల హక్కును ఉల్లంఘించడమే అవుతుందన్నారు. ‘ఇంటికి చెందిన ప్రతి వస్తువు, నిర్మాణం ఇంటి ప్రాంగణంలోనే ఉండాలి. వీధులను ఆక్రమిస్తే వాస్తు శక్తికి ఆటంకం కలుగుతుంది. ఎవరి పరిధిలో వారు ఉంటేనే వాస్తు ఫలితాలు పూర్తిగా లభిస్తాయి’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>

News November 16, 2025

WGL: ప్రత్యేక లోక్‌ అదాలత్‌లో 5,025 కేసుల పరిష్కారం: సీపీ

image

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన ప్రత్యేక లోక్‌ అదాలత్‌కు విశేష స్పందన లభించింది. ఈ అదాలత్ ద్వారా 5,025 కేసులను పరిష్కరించినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. సైబర్ క్రైమ్ కేసుల్లో రూ.89 లక్షలకు పైగా రిఫండ్ మొత్తాన్ని బాధితులకు అందజేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

News November 16, 2025

ఎర్రకోట ఆత్మాహుతి దాడి.. కీలక నిందితుడు అరెస్ట్

image

ఢిల్లీ ఎర్రకోట వద్ద ఆత్మాహుతి దాడి కేసులో కీలక పురోగతి సాధించినట్లు NIA ప్రకటించింది. ఈ దాడికి సూసైడ్ బాంబర్ ఉమర్ నబీతో కలిసి కుట్ర చేసిన కశ్మీర్ వాసి అమీర్ రషీద్ అలీని అరెస్టు చేసినట్లు తెలిపింది. కారును కొనుగోలు చేసి, అందులో IED అమర్చేందుకే ఇతను ఢిల్లీకి వచ్చినట్లు పేర్కొంది. ఈనెల 10న జరిగిన ఆత్మాహుతి దాడిలో 10 మంది మరణించగా, 32 మంది గాయపడిన విషయం తెలిసిందే.