News February 19, 2025
వరంగల్ మార్కెట్లో తగ్గిన మిర్చి ధరలు

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మంగళవారంతో పోలిస్తే ఈరోజు మిర్చి ధరలు స్వల్పంగా తగ్గాయి. క్వింటా తేజ మిర్చి ధర మంగళవారం రూ.13,600 పలకగా.. నేడు రూ.13,400కి చేరింది. అలాగే వండర్ హాట్(WH) మిర్చికి నిన్న రూ.16,200 ధర రాగా.. ఈరోజు రూ. 16,100 కి పడిపోయింది. మరోవైపు 341 మిర్చికి నిన్న రూ.13,400 ధర రాగా.. నేడు రూ.13,300 కి తగ్గింది.
Similar News
News December 4, 2025
గుడివాడ-కంకిపాడు రోడ్డు నిర్మాణం ప్రారంభించండి: బాలశౌరి

ఢిల్లీలోని పార్లమెంట్ హాల్లో CoSL ఛైర్మన్ ఎంపీ బాలశౌరితో నేషనల్ హైవే ఛైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో గుడివాడ-కంకిపాడు గ్రీన్ ఫీల్డ్ రోడ్డు, పెడన లక్ష్మీపురం రోడ్డు, తదితర పనులను ఎంపీ బాలశౌరి NHAI ఛైర్మన్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై ఛైర్మన్ సానుకూలంగా స్పందించి, ఆ పనులను త్వరగా ప్రారంభించాలని సంబంధిత అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేశారు.
News December 4, 2025
పోలీసుల ‘స్పందన’ లేక..

ఆకతాయి వేధింపులపై ఫిర్యాదు చేసినా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే తమ కుమార్తె <<18465236>>స్పందన<<>> (17) బలవన్మరణానికి పాల్పడి మరణించిందని తల్లిదండ్రులు వాపోయారు. బస్సులో యువకుడి వేధింపులపై తాము ఫిర్యాదు చేస్తే చెన్నేకొత్తపల్లి పోలీసులు పట్టించుకోలేదని, వారు సక్రమంగా వ్యవహరించి ఉంటే తమ బిడ్డను కోల్పోయేవారం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే తమకు కడపుకోత మిగిలిందని బోరున విలపించారు.
News December 4, 2025
ఇంటర్వ్యూతో ICSILలో ఉద్యోగాలు

ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్(<


