News August 22, 2024

వరంగల్ మార్కెట్‌లో తగ్గిన మిర్చి ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో నిన్నటితో పోలిస్తే ఈరోజు మిర్చి ధరలు తగ్గాయి. బుధవారం క్వింటా తేజ మిర్చి ధర రూ.18,500 పలకగా.. నేడు సైతం అదే ధర పలికింది. అలాగే 341 రకం మిర్చికి నిన్న రూ.15వేలు పలకగా నేడు రూ.14,500 కి పడిపోయింది. మరోవైపు వండర్ హాట్ మిర్చి(WH) కి నిన్న రూ.16,000 ధర రాగా ఈరోజు రూ.15 వేలకి దిగజారింది.

Similar News

News September 18, 2024

పద్మాక్షి అమ్మవారి శరన్నవరాత్రులకు రావాలని సీఎంకు ఆహ్వానం

image

శ్రీ హనుమద్గిరి పద్మాక్షి దేవికి వచ్చేనెల 3 నుంచి 14 వరకు శరన్నవరాత్రులు జరుగనున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి-గీతా రెడ్డి దంపతులను పద్మాక్షి అమ్మవారి దేవాలయ వేద పండితులు నాగిళ్ల షణ్ముఖ పద్మనాభ అవధాని కలిసి ఆహ్వానించారు. సీఎంకు అమ్మవారి ప్రసాదం అందజేసి ఆశీర్వచనం చేశారు.

News September 18, 2024

రైలు కిందపడి కేయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆత్మహత్య

image

రైలు కిందపడి కేయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ రైల్వే స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. జీఆర్పీ పోలీసుల వివరాల ప్రకారం.. గీసుకొండ మండలం ధర్మారానికి చెందిన విజ్ఞాన్(32) తల్లి కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో తల్లికి ఏమైనా జరుగుతుందేమోనని భయాందోళనకు గురైన విజ్ఞాన్ చింతలపల్లి రైల్వేగేటు సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.

News September 18, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రైమ్ న్యూస్..

image

> MHBD: చేపల వేటకు వెళ్ళి వ్యక్తి మృతి..
> WGL: మట్కా నిర్వహిస్తున్న మహిళా అరెస్టు..
> MHBD: బైక్ అదుపు తప్పి ఒకరికి తీవ్ర గాయాలు…
> WGL: బట్టల బజార్ మ్యాచింగ్ సెంటర్లో అగ్నిప్రమాదం..
> MHBD: గంజాయి పట్టివేత…
> WGL: మతిస్తిమితం లేని మహిళపై అత్యాచారం…
> WGL: అనారోగ్యంతో ప్రయాణికుడు మృతి…