News August 30, 2024
వరంగల్ మార్కెట్‌లో తగ్గిన పత్తి ధర
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో నేడు పత్తి ధర మళ్లీ తగ్గింది. ఈరోజు క్వింటా పత్తి రూ.7,500 పలికింది. ఈ వారం మొదటి రోజు (మంగళవారం) పత్తి ధర రూ.7,600 పలకగా, బుధవారం రూ.7,560కి చేరింది. గురువారం మరింత తగ్గి రూ.7,555కి పడిపోయి, నేడు మరింత పతనమైంది. పత్తి ధరలు రోజురోజుకు తగ్గుతుండడంతో రైతన్నలు తలలు పట్టుకుంటున్నారు.
Similar News
News September 18, 2024
ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రైమ్ న్యూస్..
> MHBD: చేపల వేటకు వెళ్ళి వ్యక్తి మృతి..
> WGL: మట్కా నిర్వహిస్తున్న మహిళా అరెస్టు..
> MHBD: బైక్ అదుపు తప్పి ఒకరికి తీవ్ర గాయాలు…
> WGL: బట్టల బజార్ మ్యాచింగ్ సెంటర్లో అగ్నిప్రమాదం..
> MHBD: గంజాయి పట్టివేత…
> WGL: మతిస్తిమితం లేని మహిళపై అత్యాచారం…
> WGL: అనారోగ్యంతో ప్రయాణికుడు మృతి…
News September 17, 2024
WGL: ఘోరం.. మతిస్తిమితం లేని మహిళపై అఘాయిత్యం
MHBD(D) కేసముద్రం(M)లో మతిస్తిమితం లేని మహిళపై ఓ యువకుడు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈనెల 10న ఇద్దరు యువకులు సదరు మహిళ ఇంటికి వెళ్లారు. వారిలో ఒకరు ఆమె కొడుకును బయటకు తీసుకెళ్లగా, మరొక వ్యక్తి అత్యాచారం చేశాడు. బయటకు వెళ్లేటప్పుడు ఆమె కొడుకు ఫోన్‌లో వీడియో రికార్డింగ్ పెట్టి వెళ్లడంతో ఈ విషయం బయటపడింది. మహిళ కుటుంబం ఫిర్యాదుతో PSలో కేసు నమోదైంది.
News September 17, 2024
వరంగల్: అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రులు
వరంగల్ ఎస్ఎన్ఎం క్లబ్ జంక్షన్ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఇంచార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దేవాదాయ మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. కార్యక్రమంలో వరంగల్ ఎంపీ, కడియం కావ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కలెక్టర్ సత్యశారదదేవి, కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, తదితరులు ఉన్నారు.