News March 6, 2025
వరంగల్ మార్కెట్లో తటస్థంగా పత్తి ధర

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు పత్తి ధరలో ఎలాంటి మార్పు లేదు. సోమవారం క్వింటా పత్తి ధర రూ.6,880 పలకగా.. మంగళవారం రూ.6,920 పలికింది. బుధవారం స్వల్పంగా తగ్గి రూ.6,900కి చేరింది. అయితే గురువారం సైతం రూ.6,900 పలికినట్లు మార్కెట్ వ్యాపారులు తెలిపారు. అయితే పత్తి ధరలు పెరగకపోవడంతో రైతన్నలు నిరాశ చెందుతున్నారు.
Similar News
News December 4, 2025
దేశ సేవలో అన్నదమ్ములు..

నంద్యాల జిల్లా రుద్రవరం గ్రామానికి చెందిన ఒకే కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు అగ్నివీరులుగా ఎంపికయ్యారు. మహబూబ్ బాషా కుమారులు అబ్దుల్ నబీ, మహమ్మద్ ఇర్ఫాన్ అగ్నివీర్ నియామకాల్లో ప్రతిభ చూపారు. బెంగళూరులో శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం మహమ్మద్ ఇర్ఫాన్ రాజస్థాన్‌లో, అబ్దుల్ నబీ హిమాచల్‌ప్రదేశ్‌లో విధుల్లో చేరి బాధ్యతలు స్వీకరించారు. దేశ సేవకు అంకితమైన వారిని స్థానికులు అభినందించారు.
News December 4, 2025
థైరాయిడ్ ట్యూమర్స్ గురించి తెలుసా?

థైరాయిడ్ గ్రంథి పనితీరుపైనే మనిషి జీవక్రియలు ఆధారపడి ఉంటాయి. ఇంతటి ప్రధానమైన థైరాయిడ్ గ్రంథిలో కొన్నిసార్లు ట్యూమర్స్ ఏర్పడతాయి. గొంతు భాగంలో వాపు/ గడ్డ ఏర్పడినట్లు కనిపిస్తుంది. ఈ వాపు అనేది ఆహారం తీసుకునేటప్పుడు లేదా మింగేటప్పుడు పైకీ కిందకీ కదులుతుంది. కానీ ఎటువంటి నొప్పి, ఇబ్బంది ఉండదని నిపుణులు చెబుతున్నారు. కణితి పరిమాణం పెరిగినప్పుడు ఆహారం తీసుకుంటుంటే పట్టేసినట్లుగా అనిపిస్తుంది.
News December 4, 2025
HYD: గూగుల్‌మ్యాప్స్ ఫాలో అవుతున్నారా? జాగ్రత్త!

గూగుల్ మ్యాప్స్ నమ్ముకుని వెళ్తున్నారా? మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రాత్రుళ్లు మరింత జాగ్రత్తగా ఉండాలి. బోడుప్పల్‌లో ఓ వ్యక్తి తన వాహనంలో గుడ్డిగా దీన్ని నమ్మి బోడుప్పల్- పోచారం రూట్లో వెళ్లాడు. కుడివైపు మొత్తం మట్టి రోడ్డు ఉన్నప్పటికీ నావిగేషన్ అటువైపే చూపించింది. కొద్ది దూరం వెళ్లాక రోడ్డు లేకపోగా, భారీ గుంతలో పడ్డట్టు తెలిపారు. మీకూ ఇలా రాంగ్ డైరెక్షన్ చూపించిందా?


