News March 6, 2025
వరంగల్ మార్కెట్లో తటస్థంగా పత్తి ధర

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు పత్తి ధరలో ఎలాంటి మార్పు లేదు. సోమవారం క్వింటా పత్తి ధర రూ.6,880 పలకగా.. మంగళవారం రూ.6,920 పలికింది. బుధవారం స్వల్పంగా తగ్గి రూ.6,900కి చేరింది. అయితే గురువారం సైతం రూ.6,900 పలికినట్లు మార్కెట్ వ్యాపారులు తెలిపారు. అయితే పత్తి ధరలు పెరగకపోవడంతో రైతన్నలు నిరాశ చెందుతున్నారు.
Similar News
News January 16, 2026
వేములవాడకు చేరుకున్న రాష్ట్ర మంత్రి సీతక్క

రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క వేములవాడకు చేరుకున్నారు. వేములవాడకు చేరుకున్న మంత్రి సీతక్కకు వేములవాడ ఆర్డీవో రాధాబాయి, ఆలయ ఈవో రమాదేవి, వేములవాడ ఏఎస్పీ రిత్విక్ సాయి ఘనంగా స్వాగతం పలికారు. రేపు శుక్రవారం ఉదయం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
News January 16, 2026
కొత్తకొండ వీరభద్ర స్వామి జాతరలో ఉద్రిక్తత!

భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్ర స్వామి జాతరలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. క్యూలైన్‌లో ఇద్దరు భక్తుల మధ్య తోపులాట జరిగింది. దీంతో అడ్డుకోబోయిన పోలీసులపై యువకుడు దురుసుగా ప్రవర్తించినట్లు సమాచారం. పోలీసులు, భక్తుల మధ్య వాగ్వాదం జరగడంతో యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News January 15, 2026
కేటీఆర్ కరీంనగర్ పర్యటన వాయిదా

కరీంనగర్‌లో ఈ నెల 19న జరగాల్సిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన వాయిదా పడింది. ఉమ్మడి జిల్లా నూతన సర్పంచుల అభినందన సభకు కేటీఆర్ హాజరుకావాల్సి ఉండగా.. అదే రోజు నుంచి ప్రభుత్వం సర్పంచులకు శిక్షణ తరగతులు ప్రకటించింది. ఈ నేపథ్యంలో సమావేశాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జి.వి.రామకృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు. సభ నిర్వహణ తేదీని త్వరలోనే ప్రకటిస్తామన్నారు.


