News February 18, 2025

వరంగల్ మార్కెట్‌లో తటస్థంగా పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధరలు రైతన్నలకు నిరాశ కలిగిస్తున్నాయి. రోజురోజుకు ధర తగ్గుతూ ఉండటంతో అన్నదాతలు ఆవేదనకు గురవుతున్నారు. సోమవారం రూ.6,800 పలికిన క్వింటా పత్తి ధర.. ఈరోజు సైతం అదే ధర పలికింది. గత వారం రూ.7,200 పైగా ధర పలకగా, ప్రస్తుతం క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ధరలు పెరిగేలా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Similar News

News March 28, 2025

వరంగల్: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని కాపాడిన పోలీసులు

image

ఆత్మహత్యయత్నానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు కాపాడారు. పర్వతగిరి మండలానికి చెందిన వెంకన్న అప్పుల బాధతో వరంగల్ ఓ సిటీ మైదానంలో పురుగులమందు తాగి ఆత్మహత్యయత్నం చేశారు. అదే సమయంలో ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఇంటర్‌సెప్టర్ పోలీసులు గమనించి అతన్ని అడ్డుకున్నారు. అనంతరం చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 28, 2025

నర్సంపేట: ‘దొంతి’కి మంత్రి పదవి దక్కేనా..!

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీనియర్ నాయకుడు, నర్సంపేట MLA దొంతి మాధవరెడ్డికి మంత్రి పదవి వస్తుందనే చర్చ కొన్ని రోజులుగా కొనసాగుతోంది. మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో దొంతికి కూడా మంత్రి పదవి వస్తుందని స్థానిక నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఢిల్లీలో జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఆయన కలిసినట్లు తెలిసింది. ఇంత వరకు నర్సంపేట నియోజకవర్గానికి చెందిన వారికి మంత్రి పదవి రాలేదు.

News March 28, 2025

వరంగల్ మార్కెట్‌కి వరుసగా నాలుగు రోజులు సెలవులు

image

వరంగల్ నగరంలోని ఎనమాముల వ్యవసాయ మార్కెట్‌కు ప్రభుత్వం వరుసగా నాలుగు రోజులు సెలవు ప్రకటించింది. ఈ మేరకు మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి తెలిపారు. ఈ సమయంలో మార్కెట్ యార్డులో ఎలాంటి క్రయవిక్రయాలు జరగవని చెప్పారు. ఈనెల 29 అమావాస్య బంధు, 30 ఆదివారం, ఉగాది, సోమవారం రంజాన్,31 మంగళవారం రంజాన్ మరుసటి రోజు ప్రభుత్వ సెలవుగా ప్రకటించబడింది. తిరిగి మార్కెట్ ఏప్రిల్ 2వ తారీకు ప్రారంభమవుతుందన్నారు.

error: Content is protected !!