News February 6, 2025
వరంగల్: మార్కెట్లో ధరల వివరాలు..

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో గురువారం వివిధ రకాల మిర్చి ఉత్పత్తులు రాగా.. ధరలు ఇలా ఉన్నాయి. 5531 మిర్చి రూ.10,500 పలకగా.. అకిరా బ్యాగడి మిర్చి రూ.11వేలు, ఎల్లో మిర్చి రూ.18 వేలు ధర వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు. అలాగే 2043 రకం మిర్చి రూ.14 వేలు, 334 మిర్చి రూ.13వేలు ధర వచ్చింది. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.
Similar News
News November 23, 2025
బాపట్ల: 2.50 లక్షల గోనె సంచులు సిద్ధం

ధాన్యం సేకరణలో రవాణా ఛార్జీలు ప్రభుత్వమే భరిస్తుందని జిల్లా సంయుక్త కలెక్టర్ భావన విశిష్ట తెలిపారు. 1,200 వాహనాలు అవసరం కానున్నాయని అంచనా వేశామన్నారు. ఇప్పటికే 450 వాహనాలు పోర్టల్లో నమోదు చేసుకున్నారని, ప్రతి వాహనానికి జిపిఎస్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు. 2.50 లక్షల గోనె సంచులు సిద్ధంగా ఉంచామన్నారు. మిల్లర్ల వద్ద మరో 10లక్షల గోనె సంచులు ఉన్నాయన్నారు.
News November 23, 2025
MNCL: DCC అధ్యక్షుడు రఘునాథరెడ్డి రాజకీయ ప్రస్థానం

మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమితులైన పిన్నింటి రఘునాథరెడ్డి రాజకీయ ప్రస్థానం విద్యార్థి దశ నుంచే ప్రారంభమైంది. 1990లో ఎన్ఎస్యూఐ పాఠశాల అధ్యక్షుడిగా, 2004-2006 వరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎన్ఎస్యూఐ అధ్యక్షుడిగా పనిచేశారు. 2007 నుంచి 2012 వరకు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ఆపై 2013-2023 వరకు టీపీసీసీ కార్యదర్శిగా, 2023 నుంచి టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా ఎదిగారు.
News November 23, 2025
1, 2, 3 ఇవి ర్యాంకులు కాదు.. కరీంనగర్ – జమ్మికుంట బస్సులు

కరీంనగర్ – అన్నారం – చల్లూర్ – వీణవంక – జమ్మికుంట రూట్లో బస్సుల రాకపోకలపై ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు ప్రతి అరగంటకు ఒక బస్సు వస్తున్నా, ఆ తర్వాత ఈ రూట్లో ఒక్కోసారి ఒకేసారి మూడు బస్సులు వస్తాయని, లేదంటే గంట, గంటన్నర వరకు బస్సులే ఉండవని ప్రయాణికులు వాపోతున్నారు. అధికారులు స్పందించి, సమయపాలనను సరిచేసి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.


