News April 2, 2025
వరంగల్ మార్కెట్లో ధరల వివరాలు

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారం వివిధ రకాల ఉత్పత్తులు తరలిరాగా ధరలు ఇలా ఉన్నాయి. టమాటా మిర్చి క్వింటా ధర రూ.28వేలు, సింగిల్ పట్టికి రూ.28,011 పలికింది. దీపిక మిర్చి క్వింటా ధర రూ.12,500, 1048 రకం మిర్చికి రూ.10వేలు, 5531 మిర్చికి రూ.9వేలు పలికినట్లు వ్యాపారులు తెలిపారు. .
Similar News
News April 10, 2025
WGL: నేడు భారీ వర్షం.. ఎల్లో హెచ్చరిక జారీ

ఉమ్మడి WGL జిల్లాలో గురువారం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ అధికారులు తెలిపారు. క్యూములోనింబస్ మేఘాల వల్ల వర్షాలు కురుస్తాయని, గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు WGL, MHBD, జనగామ, HNK, భూపాలపల్లి జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. ములుగులో మోస్తరుగా వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. జర జాగ్రత్త. SHARE IT
News April 9, 2025
వరంగల్: క్రికెట్ బెట్టింగ్ కేసు.. 9 మంది అరెస్ట్

ఐపీఎల్ సీజన్ ప్రారంభం కావడంతో యువత సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతున్నారు. సీజన్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం నాలుగు క్రికెట్ బెట్టింగ్ కేసులు నమోదు చేసి, తొమ్మిది మందిని అరెస్ట్ చేసినట్లు సీపీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బుకీని సైతం అదుపులోకి తీసుకున్నట్లు ఆయన వివరించారు.
News April 9, 2025
భూపాలపల్లి: పెళ్లి కావట్లేదని యువకుడి సూసైడ్

పెళ్లి కావట్లేదని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. చిట్యాల మండలం వెంచరామికి చెందిన లక్ష్మణ్(28) ట్రాక్టర్ డ్రైవర్‌గా చేస్తున్నాడు. తన అమ్మానాన్న చనిపోవడంతో చిన్నమ్మ వద్ద ఉంటున్నాడు. తన కంటే చిన్నవాళ్లకు పెళ్లవుతుందని మనస్తాపంతో పురుగుమందు తాగాడు. ఆసుపత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ చనిపోయాడు. లక్ష్మణ్ చిన్నమ్మ కుమార్తె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.