News February 6, 2025

వరంగల్: మార్కెట్‌లో ధరల వివరాలు..

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో గురువారం వివిధ రకాల మిర్చి ఉత్పత్తులు రాగా.. ధరలు ఇలా ఉన్నాయి. 5531 మిర్చి రూ.10,500 పలకగా.. అకిరా బ్యాగడి మిర్చి రూ.11వేలు, ఎల్లో మిర్చి రూ.18 వేలు ధర వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు. అలాగే 2043 రకం మిర్చి రూ.14 వేలు, 334 మిర్చి రూ.13వేలు ధర వచ్చింది. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.

Similar News

News March 22, 2025

మండపేట: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

మాచవరం- రామచంద్రపురం రోడ్లో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందినట్లు రాయవరం ఎస్సై సురేష్ బాబు తెలిపారు. ఎస్సై వివరాల మేరకు.. మండపేట మండలం ఏడిద గ్రామానికి చెందిన శ్రీను బైక్‌పై వెళ్తుండగా సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టడంతో ఇద్దరు కిందపడ్డారు. బైక్ నడుపుతున్న శ్రీను తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News March 22, 2025

నిర్మల్: అకాల వర్షం అన్నదాతకు కన్నీరు 

image

నిర్మల్ జిల్లాలో నిన్న సాయంత్రం కురిసిన అకాల వర్షం, ఈదురు గాలుల వల్ల వరి, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు పంటలు నేల మట్టమయ్యాయి. వరిపొలాల గొలక నేలకు ఒరిగిందని రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. పంటలు నేలకు ఒరగడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరారు.

News March 22, 2025

అనకాపల్లి: క్వారీలో గాయపడిన కార్మికుడి మృతి

image

అనకాపల్లి మండలం కుంచంగి క్వారీలో శుక్రవారం పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు గాయపడిన కార్మికుడు అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ రవికుమార్ తెలిపారు. మృతి చెందిన కార్మికుడు ఒడిశా రాష్ట్రానికి చెందిన జానీగా పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

error: Content is protected !!