News August 14, 2024
వరంగల్: మార్కెట్‌లో నేటి పత్తి ధర రూ.7150
ఎనుమాముల మార్కెట్‌లో పత్తి గరిష్ఠంగా రూ.7150 లు పలికింది. రూ.5000-6500 వరకు పత్తి నాణ్యతను బట్టి వ్యాపారస్తులు కొనుగోలు చేస్తున్నారు. మొత్తంగా బుధవారం మార్కెట్‌కు 150 పత్తి బ్యాగులు వచ్చినట్లు మార్కెట్ వ్యాపారస్తులు, మార్కెట్ కమిటీ వారు తెలిపారు. కాగా, ఇదే పత్తి ధర నిన్న రూ.7180 లు గరిష్ఠంగా పలికింది. కాగా, నిన్నటికి ఇవాళ్టికి పత్తి ధరలో రూ.30 వ్యత్యాసం కనపడింది.
Similar News
News September 8, 2024
మేడారం అడవుల్లో విపత్తుపై ప్రభుత్వానికి నివేదిక
మేడారం అడవుల్లో ఘోర విపత్తుపై ప్రభుత్వానికి అటవీ రక్షణ ప్రధానాధికారి డోబ్రియాల్ని నివేదిక ఇచ్చారు. క్లౌడ్ బరస్ట్ వల్లే ఈ విపత్తు సంభవించిందని, మేఘాలు కిందకు వచ్చి బరస్ట్ కావడంతోనే చెట్లు నేలకూలాయని తెలిపారు. 3 కి.మీటర్ల పొడవు, 2 కిలో మీటర్ల వెడల్పులో 204 హైక్టార్లలో 50 వేల చెట్లు కూలాయన్నారు. క్లౌడ్ బరస్ట్ ఎందుకు జరిగిందో తెలుసుకోవాలని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌కు తెలిపామని అన్నారు.
News September 7, 2024
ఎల్లం బజార్లో 40 ఫీట్ల భారీ మట్టి గణపతి
వినాయక చవితి వేడుకలకు ఉమ్మడి వరంగల్ జిల్లా సిద్ధమైంది. జిల్లా వ్యాప్తంగా వినాయక మండపాలకు గణనాథులను భక్తులు బాజాబజంత్రీలతో తీసుకువచ్చారు. వరంగల్ జిల్లా కేంద్రంలోని ఎల్లం బజార్లో భద్రకాళి హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ తరహాలో 40 అడుగుల భారీ మట్టి గణపతిని ఏర్పాటు చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఎల్లంబజార్ గణపతి ప్రతిమ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
News September 7, 2024
వరంగల్: నేరస్తులపై రౌడీషీట్లు తెరుస్తున్న పోలీసులు
పోలీసు కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా అన్నారు. వరంగల్ నగరంలో నేరాలను నియంత్రించేందుకు పోలీస్ కమిషనరేట్ పోలీసులు నేరస్తులపై ఉక్కు పాదం మోపుతున్నారు. పక్కా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారు. 8 నెలల కాలంలో 36 మందిపై రౌడీ షీట్స్, 73 మందిపై సస్పెక్టెడ్ షీట్స్ తెరిచారు.