News January 23, 2025

వరంగల్ మార్కెట్లో పడిపోయిన పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో గత మూడు రోజులతో పోలిస్తే నేడు పత్తి ధర తగ్గింది. సోమవారం రూ.7,220 పలికిన క్వింటా పత్తి ధర.. మంగళవారం రూ.7,200, బుధవారం రూ.7,210 అయింది. అయితే నేడు ధర భారీగా తగ్గి రూ.7,135కి చేరినట్లు వ్యాపారులు తెలిపారు. ధర తగ్గడంతో రైతన్నలు నిరాశ చెందుతున్నారు. ధరలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Similar News

News October 31, 2025

‘దేశ ఐక్యత, సమగ్రతకు పటేల్ కృషి చిరస్మరణీయం’

image

దేశ ఐక్యత, సమగ్రతకు సర్ధార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి చరిత్రలో చిరస్మరణీయమని, ఆయన ఆలోచనలు, స్ఫూర్తి నేటి తరానికి మార్గదర్శకమని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గితే అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన జయంతిని ఘనంగా నిర్వహించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి ఎస్పీ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అదనపు ఎస్పీ చంద్రయ్య పాల్గొన్నారు.

News October 31, 2025

సుశాంత్‌ను ఇద్దరు కలిసి చంపారు: సోదరి శ్వేతా సింగ్

image

2020లో జరిగిన బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ మరణంపై సోదరి శ్వేతా సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. సుశాంత్‌ది ఆత్మహత్య కాదని, ఇద్దరు కలిసి హత్య చేశారని ఆరోపించారు. ఈ విషయాన్ని US, ముంబైలోని ఇద్దరు సైకిక్స్ వేర్వేరుగా తనకు చెప్పారన్నారు. ‘సుశాంత్ బెడ్, ఫ్యాన్ మధ్య దూరాన్ని బట్టి అతను ఉరేసుకుని చనిపోయే అవకాశమే లేదు. మెడపై దుపట్టా మార్క్ కాకుండా ఒక చిన్న చెయిన్ ముద్ర మాత్రమే కనిపించింది’ అని పేర్కొన్నారు.

News October 31, 2025

NZB: కల్వల మత్తడి మరమ్మతులు వెంటనే చేపట్టాలి: కవిత

image

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని కల్వల మత్తడి మరమ్మతులను వెంటనే చేపట్టాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. కల్వల ప్రాజెక్టును ఆమె శుక్రవారం సందర్శించారు. మత్తడి కొట్టుకుపోయి 3 ఏళ్లు అవుతోందన్నారు. మరమ్మతులకు గత ప్రభుత్వమే రూ.70 కోట్లు విడుదల చేస్తూ జీవో ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు బాగు చేయించలేదన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 6 వేల ఎకరాలకు సాగు నీరందుతుందన్నారు.