News January 23, 2025

వరంగల్ మార్కెట్లో పడిపోయిన పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో గత మూడు రోజులతో పోలిస్తే నేడు పత్తి ధర తగ్గింది. సోమవారం రూ.7,220 పలికిన క్వింటా పత్తి ధర.. మంగళవారం రూ.7,200, బుధవారం రూ.7,210 అయింది. అయితే నేడు ధర భారీగా తగ్గి రూ.7,135కి చేరినట్లు వ్యాపారులు తెలిపారు. ధర తగ్గడంతో రైతన్నలు నిరాశ చెందుతున్నారు. ధరలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Similar News

News February 20, 2025

ఫాస్టాగ్ 70 నిమిషాల రూల్‌పై NHAI క్లారిటీ

image

టోలో‌ప్లాజాకు చేరుకునే ముందు 60 నిమిషాలు, తర్వాత 10 నిమిషాలు ఫాస్టాగ్ ఇన్‌యాక్టివ్‌లో ఉంటే డబుల్ టోల్ ఫీజు చెల్లించాల్సి వస్తోంది. FEB 17 నుంచి అమల్లోకి వచ్చిన తాజా నిబంధనలతో ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు. దీనిపై NHAI క్లారిటీ ఇచ్చింది. ఫాస్టాగ్ జారీ చేసిన బ్యాంక్, టోల్ పేమెంట్ అందుకున్న బ్యాంక్ మధ్య వివాదాల పరిష్కారాన్ని సులభతరం చేయడానికి NPCI ఈ సర్క్యూలర్ జారీ చేసిందని వెల్లడించింది.

News February 20, 2025

BREAKING: జగన్‌పై కేసు నమోదు

image

AP: మాజీ సీఎం జగన్‌పై కేసు నమోదైంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉందని హెచ్చరించినా పట్టించుకోకుండా గుంటూరు మిర్చి యార్డు కార్యక్రమం నిర్వహించినందుకు నల్లపాడు పోలీసులు చర్యలు తీసుకున్నారు. జగన్, కొడాలి నాని, అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, నందిగం సురేశ్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో సహా 8 మందిపై కేసు పెట్టారు.

News February 20, 2025

మెదక్: బీఆర్ఎస్ సమావేశానికి మాజీ జడ్పీ ఛైర్ పర్సన్

image

తెలంగాణ భవన్‌లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశానికి ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన పలువురు నాయకులు హాజరయ్యారు. మెదక్ జడ్పీ ఛైర్ పర్సన్ ర్యాకల హేమలత శేఖర్ గౌడ్ హాజరయ్యారు. ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ మంత్రి హరీశ్ రావు, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, సిద్దిపేట జడ్పీ ఛైర్ పర్సన్ రోజా శర్మ, వంటేరు ప్రతాపరెడ్డి, చింత ప్రభాకర్ తదితరులు హాజరయ్యారు.

error: Content is protected !!