News September 26, 2024
వరంగల్ మార్కెట్లో పత్తి ధరలు ఇలా..
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర నిన్నటి లాగే ఈరోజు తటస్థంగా ఉంది. బుధవారం రూ.7,500 పలికిన క్వింటా పత్తి ధర ఈరోజు సైతం అదే ధర పలికినట్లు వ్యాపారులు తెలిపారు. అలాగే నేడు మార్కెట్కు కొత్త పత్తి తరలిరాగా ధర సైతం నిన్న, మొన్నటితో పోలిస్తే కొంత తగ్గింది. నేడు కొత్త పత్తి క్వింటాకు రూ.7,070 పలికినట్లు అధికారులు పేర్కొన్నారు.
Similar News
News November 25, 2024
నర్సంపేట: 29న పారా మెడికల్ కోర్సులకు ఇంటర్వ్యూలు
నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల అనుబంధంగా ఈ ఏడాది ప్రారంభం కానున్న పారా మెడికల్ కళాశాలలో వివిధ కోర్సుల ప్రవేశానికి ఈ నెల 29న ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ దాస్ తెలిపారు. నర్సంపేట ప్రభుత్వ పారామెడికల్ కళాశాలలో D.ECG, D.Dialysis కోర్సులు ఉన్నట్లు తెలిపారు. ఆన్లైన్ దరఖాస్తు ఫారం, అభ్యర్థి ధ్రువీకరణ పత్రాలతో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు.
News November 25, 2024
MHBD: మొదటి జీతం అందుకోకుండానే టీచర్ మృతి
ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే కల సాకారం చేసుకొని మొదటి జీతం అందుకోకుండానే రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడిని మృత్యువు కబళించింది. MHBD జిల్లా గంగారం మండలం బావురుగొండ టీచర్ ఉపేందర్ (45) పాఠశాలకు వెళ్తున్న క్రమంలో లారీ ఢీకొని మృతి చెందారు. బయ్యారం మండలానికి చెందిన ఉపేందర్ ఇటీవల ఎస్జీటీ ఉద్యోగం సాధించారు. ఉపేందర్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
News November 25, 2024
నేడు మహబూబాబాద్ జిల్లాకు కేటీఆర్
నేడు మహబూబాబాద్ జిల్లాకు కేటీఆర్ రానున్నారు. లగచర్ల ఘటనను నిరసిస్తూ పట్టణంలో పార్టీ నాయకులతో కలిసి మహాధర్నా చేయనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగనుంది. కాగా, ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు భారీ ఎత్తున పాల్గొననున్నారు.