News October 1, 2024
వరంగల్: మార్కెట్లో పత్తి ధరల వివరాలు
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధర తటస్తంగా ఉంది. సోమవారం క్వింటా పత్తి ధర రూ. 7450 పలకగా… నేడు కూడా అదే ధర పలికింది. అలాగే ఈరోజు మార్కెట్ తరలిరాగా రూ. 6910 ధర వచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే గత వారంతో పోలిస్తే ధరలు పడిపోయాయని వ్యాపారులు తెలుపుతున్నారు. మార్కెట్లో కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతోంది.
Similar News
News October 10, 2024
హనుమకొండ జిల్లాలో విషాదం.. ఒకేరోజు తల్లి, కొడుకు మృతి
హనుమకొండ జిల్లాలో బుధవారం విషాదం నెలకొంది. వివరాలిలా.. భీమదేవరపల్లి మండలం ములుకనూరుకి చెందిన శోభ(53)కు టీబీ వ్యాధి సోకగా, కుమారుడు సాయికిరణ్(25) క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో తల్లి శోభ నిన్న ఉదయం చనిపోగా, సాయికిరణ్ రెండు గంటల్లో చనిపోయాడు. తల్లి, కొడుకు ఒకే రోజు మృతి చెందడంతో ఈ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
News October 10, 2024
ఎంపీ విందులో పాల్గొన్న వరంగల్ ఎమ్మెల్యేలు
రాజ్యసభ సభ్యులు అభిషేక్ సింగ్ బుధవారం రాత్రి హైదరాబాద్ బంజారాహిల్స్‌లో విందు ఏర్పాటుచేశారు. ఈ విందులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. వీరితో కలిసి ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డా. రామచంద్రనాయక్, వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజులు సైతం పాల్గొని విందు భోజనం చేశారు.కార్యక్రమంలో పలువురు ముఖ్య నేతలు ఉన్నారు.
News October 10, 2024
తెలంగాణ ఆత్మగౌరవానికి, అస్తిత్వానికి ప్రతీక బతుకమ్మ : మంత్రి సురేఖ
బతుకమ్మ పండుగ తెలంగాణ ఆత్మగౌరవానికి, అస్తిత్వానికి, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని మంత్రి కొండా సురేఖ అన్నారు. రేపు సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకుని మంత్రి సురేఖ తెలంగాణ ఆడపడుచులకు, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రంగు రంగుల పూల రూపంలోని ప్రకృతి పట్ల ఆరాధనను, స్త్రీ శక్తిని కొలిచే పండుగగా బతుకమ్మ పండుగకు తెలంగాణ సంస్కృతిలో విశిష్ట స్థానముందన్నారు.