News December 19, 2024

వరంగల్ మార్కెట్‌లో పత్తి క్వింటా రూ.7,020 

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో కొద్దిరోజులుగా పత్తి ధర రూ.7 వేలకు పైగా పలుకుతోంది. సోమవారం రూ.7,010 పలికిన క్వింటా పత్తి ధర.. మంగళవారం రూ.7,000, బుధవారం రూ.7,030 పలికాయి. అలాగే నేడు రూ.7,020 పలికినట్లు వ్యాపారులు తెలిపారు. మార్కెట్‌కి ఈరోజు పత్తి తరలి రాగా క్రయవిక్రయాలు కొనసాగుతున్నాయి.

Similar News

News October 15, 2025

ధాన్యం సేకరణకు విస్తృత ఏర్పాట్లు: వరంగల్ కలెక్టర్

image

రైతులు పండించిన ధాన్యం సేకరణ ప్రక్రియ ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద వెల్లడించారు. బుధవారం ధాన్యం కొనుగోళ్లపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రవాణా పరమైన ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నామని కలెక్టర్ తెలిపారు.

News October 15, 2025

గౌరీ కేదారేశ్వర నోములు 21నే: ప్రధానార్చకుడు

image

పరమపవిత్రమైన గౌరీ కేదారీశ్వర నోములను ఈనెల 21 మంగళవారం రోజున ఆచరించాలని భద్రకాళి దేవస్థానం ప్రధానార్చకుడు భద్రకాళి శేషు తెలిపారు. ఈనెల 20న నరక చతుర్దశి సందర్భంగా సూర్యోదయానికి ముందే స్నానాలు చేసి, హారతులు తీసుకోవాలన్నారు. సూర్యోదయానికి ముందు తైలం రాసుకొని స్నానం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని చెప్పారు.

News October 15, 2025

రేపు ములుగు రోడ్డులో జాబ్ మేళా..!

image

నిరుద్యోగ యువతీయువకులకు ఈనెల 16న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు వరంగల్ జిల్లా ఉపాధి కల్పన అధికారి సాత్విక తెలిపారు. ఆల్ మార్క్ ఫైనాన్సియల్ సర్వీసెస్లో రికవరీ ఏజెంట్, టెలీకాలర్ ఉద్యోగాల కోసం మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తిగలవారు తమ విద్యార్హత సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో ములుగు రోడ్డులోని ఐటీఐ ప్రాంగణంలో గల జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో జరగనున్న జాబ్ మేళాకు హాజరు కావాలన్నారు.