News February 21, 2025
వరంగల్ మార్కెట్లో పత్తి ధర రూ. 6,800

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నేడు పత్తి ధర మళ్లీ తగ్గింది. సోమవారం, మంగళవారం రూ.6,800 పలికిన క్వింటా పత్తి ధర.. బుధవారం, గురువారం రూ.6,810 పలికింది. ఈరోజు మళ్లీ రూ.10 తగ్గి, రూ.6,800కి పడిపోయినట్లు వ్యాపారులు తెలిపారు. మార్కెట్‌కు నేడు పత్తి తరలి రాగా.. ధర తగ్గడంతో అన్నదాతలు నిరాశ చెందుతున్నారు.
Similar News
News December 5, 2025
రెండేళ్లలో 6 గ్యారంటీలకు ₹76,382 కోట్లు

TG: రెండేళ్ల పాలనలో 6 గ్యారంటీల అమలుకు ₹76,382 కోట్లు ఖర్చు చేసినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. ఆర్టీసీలో మహిళల ఉచిత ప్రయాణానికి ₹8,402Cr, ₹500కే గ్యాస్ సిలిండర్ స్కీమ్‌కు ₹700Cr, గృహజ్యోతి ₹3,438Cr, ఇందిరమ్మ ఇళ్లకు ₹3,200 Cr, ఆరోగ్యశ్రీ ₹3,000 Cr, రైతు భరోసా ₹20,616Cr, యంగ్ ఇండియా స్కూళ్లకు ₹15,600Cr ఖర్చు చేసినట్లు వెల్లడించింది. రెండేళ్లలో 61,379 ఉద్యోగాలు ఇచ్చినట్లు పేర్కొంది.
News December 5, 2025
కూసుమంచిలో అత్యధిక జీపీలు, వార్డులు

ఖమ్మం జిల్లాలో అత్యధిక జీపీలు, వార్డులు కూసుమంచి మండలంలో ఉన్నాయి. మండలంలో 41 జీపీలకు గాను 364 వార్డులు ఉన్నాయి. ఆ తర్వాత సింగరేణి మండలంలో 41 జీపీలు, 356 వార్డులు, తిరుమలాయపాలెం మండలంలో 40 జీపీలు 356 వార్డులు ఉన్నాయి. కూసుమంచి మండలంలో మొత్తం 50,357 మంది ఓటర్లకు గాను 24,321 మంది పురుషులు, 26,035 మంది మహిళలు ఇతరులు ఒకరు ఓటరుగా నమోదయ్యాయి.
News December 5, 2025
కుడా భవనం ఆ అల్లుడి కోసమేనా..?

కుడా భవనంను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయడానికి రంగం సిద్దమైంది. ప్రభుత్వ డబ్బులతో కట్టిన బిల్డింగ్‌ను, నిర్వహణ భారం పేరిట ప్రైవేట్ వ్యక్తికి అప్పగించడానికి ఈనెల 15వ తేదీని టార్గెట్‌గా నిర్ణయించారు. కుడా కార్యాలయంలోని 8 విభాగాలను, ప్రధాన కార్యాలయాన్ని, కాళోజీ కళా క్షేత్రానికి తరలించాలని నిర్ణయించారు. లీజ్ పేరిట ప్రస్తుత కుడా కార్యాలయాన్ని ఓ నేత అల్లుడికి ఆసుపత్రి కోసం ఇస్తున్నట్టు సమాచారం.


