News February 18, 2025
వరంగల్ మార్కెట్లో పలు ఉత్పత్తుల ధరల వివరాలు

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి మంగళవారం వివిధ రకాల ఉత్పత్తులు తరలిరాగా ధరలు ఇలా ఉన్నాయి. 5,531 మిర్చి ధర రూ.11 వేలు పలకగా, దీపిక మిర్చి రూ.16,200, అకిరా బ్యాగడి రూ.11 వేల ధర పలికాయి. అలాగే నం. 5 రకం మిర్చి రూ.12 వేలు, ఇండికా మిర్చికి రూ.16,200, మక్కలు(బిల్టీ)కి రూ.2,311 వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు.
Similar News
News April 17, 2026
నేడు కలెక్టరేట్ వద్ద ఉద్యోగుల నిరసన

రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు శుక్రవారం కలెక్టరేట్ వద్ద భోజన విరామ సమయంలో నిరసన చేపట్టనున్నట్లు వరంగల్ జిల్లా ఛైర్మన్ గజ్జల రామ్ కిషన్ తెలిపారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యల సాధన కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నిరసనకు అనుమతి కోరుతూ అదనపు కలెక్టర్ సంధ్యారాణికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ ఫణి కుమార్, ఇతర నాయకులు పాల్గొన్నారు.
News April 16, 2026
గీసుగొండ: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై కలెక్టర్ సమీక్ష

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గీసుగొండ మండలం కోనాయిమాకులం రైతు వేదికలో మండల స్థాయి సమావేశం జరిగింది. కలెక్టర్ డా. సత్య శారద ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం నిర్దేశించిన పది ముఖ్య అంశాలపై అధికారులు, సర్పంచులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. గ్రామాభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలని, ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
News April 13, 2026
వరంగల్ ప్రజావాణిలో 166 వినతులు

వరంగల్ జిల్లా కలెక్టరేట్‌లో ఈ రోజు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ డా.సత్య శారద ప్రజల నుంచి 166 వినతిపత్రాలను స్వీకరించారు. ఇందులో రెవెన్యూ శాఖకు 74, జీడబ్ల్యూఎంసీకి 25, ఇతర శాఖలకు 67 దరఖాస్తులు వచ్చాయి. సంబంధిత అధికారులతో సమక్షంలోనే చర్చించి సమస్యలను తెలుసుకున్న కలెక్టర్, వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు. జూమ్ ద్వారా తహశీల్దార్లు, ఎంపీడీవోలతో సమన్వయం చేసి చర్యలు చేపట్టారు.


